Home న్యూస్ సుదీర్ బాబు ఆశలపై నీళ్ళు చల్లిన మహారాజ…ఇది ఊహించలేదుగా!!

సుదీర్ బాబు ఆశలపై నీళ్ళు చల్లిన మహారాజ…ఇది ఊహించలేదుగా!!

0

చాలా టైం గా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర(Harom Hara Movie) తో కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అని అందరూ ఎక్స్ పెర్ట్ చేయగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి టాక్ కూడా సొంతం అయ్యింది. దాంతో ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో…

ఎప్పటి నుండో కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సుదీర్ బాబుకి కంబ్యాక్ దక్కడం ఖాయం అనుకున్నా కూడా అనుకోకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీ మహారాజ(Maharaja Movie) గట్టి ఎదురుదెబ్బే కొట్టింది…. విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కూడా వరుస ఫ్లాఫ్స్ లో ఉండటంతో ఈ సినిమా తన కెరీర్ లో…

ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కగా మంచి రివ్యూలను సొంతం చేసుకున్న సినిమా తమిళ్ లో ఇటు తెలుగులో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా హిట్ నుండి ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతున్న సినిమా హరోం హర కి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి ఎదురుదెబ్బ కొట్టింది ఇప్పుడు….వీకెండ్ లోనే అనుకుంటే…

Harom Hara 1st Weekend (3 Days) WW Collections Report!

వర్కింగ్ డేస్ లో కూడా హరోం హర సినిమాను ఫుల్ గా డామినేట్ చేస్తున్న మహారాజ సినిమా తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకోగా హిట్ అవుతుంది, కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్న హరోం హర సుదీర్ బాబుకి మంచి టాక్ తో కూడా ఇప్పుడు నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం అయ్యేలా చేయబోతుంది.

కానీ ఈ వారంలో కూడా కొత్త సినిమాలు ఏమి లేక పోవడంతో ఎంతో కొంత హోల్డ్ ని చూపిస్తే బిజినెస్ లో ఎంతో కొంత అమౌంట్ ని రికవరీ చేసే అవకాశం ఉంటుంది, కానీ ఓవరాల్ గా మాత్రం మంచి టాక్ వచ్చినా కూడా హరోం హరకి ఆశించిన రిజల్ట్ ఏమాత్రం సొంతం అవ్వలేదు అనే చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here