మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో సోలో హీరోగా రీసెంట్ గా పెద్దగా హిట్స్ ఏమి కొట్టలేదు…ఇలాంటి టైంలో తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా మహారాజ(Maharaja) సినిమా చేయగా, ట్రైలర్ ఆకట్టుకున్నా కొంచం లో బజ్ తోనే వచ్చిన ఈ సినిమా అన్ని చోట్లా యునానిమస్ పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా…
కలెక్షన్స్ పరంగా కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపించి లాంగ్ రన్ లో ఏకంగా విజయ్ సేతుపతి కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడమే కాదు ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది….
తెలుగు లో కూడా కొంచం స్లో స్టార్ట్ నే సొంతం చేసుకున్నా కూడా ఎక్స్ లెంట్ రివ్యూల హెల్ప్ తో మంచి లాంగ్ రన్ ను దక్కించుకున్న ఈ సినిమా తెలుగు లో వాల్యూ బిజినెస్ డబుల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. తెలుగు లో సినిమా టోటల్ రన్ లో…
సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Maharaja(Telugu States) Total Collections
👉Nizam: 3.18CR~
👉Ceeded: 1.00CR~
👉Andhra: 2.27CR~
AP-TG Total:- 6.45CR(13.15CR~ Gross)
తెలుగు లో 3.50 కోట్ల టార్గెట్ మీద ఆల్ మోస్ట్ 2.95 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుంది.
ఇక టోటల్ రన్ లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Maharaja Movie Total World Wide Collections
👉Tamilnadu – 53.85Cr
👉Telugu States- 13.15Cr
👉Ka+ROI – 13.30Cr
👉Overseas – 24.25Cr***
Total WW collection – 104.55CR(50.55CR~ Share) Approx
మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా టోటల్ రన్ లో ఏకంగా 29.55 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని హ్యూజ్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆల్ మోస్ట్ డౌన్ అయిన విజయ్ సేతుపతి కెరీర్ కి మళ్ళీ సాలిడ్ ఊపు ఇచ్చింది ఈ సినిమా విజయం….