Home న్యూస్ మహావీరుడు రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

మహావీరుడు రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

తెలుగులో వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ మరియు ప్రిన్స్ సినిమాలతో పర్వాలేదు అనిపించేలా క్రేజ్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ హీరో శివకార్తికేయన్(Siva Karthikeyan) ఆడియన్స్ ముందుకు ఇప్పుడు మహావీరుడు(Mahaveerudu Telugu Review) అంటూ వచ్చేశాడు….తమిళ్ లో మావీరన్(Maaveran) గా వచ్చిన ఈ సినిమా…ఒకేసారి తమిళ్ తెలుగులో రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… 

ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… చాలా భయస్తుడు అయిన హీరో ఒక పొలిటికల్ పార్టీ కోసం ఒక కార్టూన్ బొమ్మలు గీయడానికి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. ఎక్కువ భయపడే హీరో లైఫ్ లో తర్వాత కొన్ని ఇంసిడెంట్ ల తర్వాత ఒక్క సారిగా పవర్ ఫుల్ గా మారతాడు. అలా మారడానికి కారణం ఏంటి, తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ ని సినిమా చూస్తున్నప్పుడే థ్రిల్ ఫీల్ అవుతాం, అందుకే ఇక్కడ ఆ పాయింట్ ని చెప్పడం లేదు, సినిమా లో శివకార్తికేయన్ గురించి చెప్పే ముందు మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) వాయిస్ ఓవర్ గురించి మెచ్చుకోవాలి. పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో సినిమా లో మేజర్ హైలెట్ గా నిలిచాడు రవితేజ..

Mahaveerudu Review And Rating
ఇక శివకార్తికేయన్ ఎప్పటి లానే డిఫెరెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకుని ఎంత ఎంటర్ టైన్ చేయాలో అంత ఎంటర్ చేస్తూనే యూనిక్ పాయింట్ ను తీసుకుని బాగానే మెప్పించాడు కానీ సెకెండ్ ఆఫ్ లో కొంచం క్లైమాక్స్ పోర్షన్ డ్రాగ్ అయినట్లు అనిపించింది… తన హీరోయిజం, ఎలివేషన్ లు, అన్నీ బాగా సెట్ అయ్యాయి.

సునీల్ రోల్ బాగుండగా హీరోయిన్ కి పెద్దగా స్కోప్ లేదు. ఇక యోగిబాబు కామెడీ బాగా వర్కౌట్ అవ్వగా తమిళ్ ఫ్లేవర్ కొంచం ఎక్కువ అయినట్లు అనిపించినా ఎంటర్ టైన్ మెంట్ వలన అవి పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్….

ఫస్టాఫ్ ఫుల్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ తో మెప్పించి ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకెండ్ ఆఫ్ పై అంచనాలను పెంచగా సెకెండ్ స్టార్ట్ అవ్వడం బాగా స్టార్ట్ అయినా తర్వాత కొంచం స్లో అయ్యి తిరిగి పుంజుకున్నా మళ్ళీ క్లైమాక్స్ ఎపిసోడ్ ని డ్రాగ్ చేయడంతో కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది…

అయినా కానీ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ పోర్షన్ మొత్తం మెప్పించడంతో పాటు అండర్ కరెంట్ గా ఇచ్చిన మెసేజ్ కూడా మెప్పించడంతో లాగ్ సీన్స్ ఉన్నా కూడా కొంచం ఓపిక పట్టి చూస్తె ఓ మంచి ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం ఖాయం, డైరెక్టర్ కొంచం లెంత్ తగ్గించి క్లైమాక్స్ ని ట్రిమ్ చేసి సెకెండ్ ఆఫ్ లో కొంచం ఎంటర్ టైన్ మెంట్ డోస్ ని పెంచి ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేది…

అయినా కానీ ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి మరీ ఫుల్ మీల్స్ పెట్టకపోయినా కానీ మంచి కామెడీతో కడుపుని దాదాపు నింపేలా మెప్పిస్తుంది మహావీరుడు మూవీ…. మరీ అంచనాలు పెట్టుకుని వెళ్ళే ఆడియన్స్ అలాగే రెగ్యులర్ ఆడియన్స్ కొంచం ఓపికతో చూస్తె ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఈ సినిమా… ఓవరాల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75/5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here