Home న్యూస్ మహర్షి ట్రైలర్ టార్గెట్ ఎన్టీఆర్…కాచుకోండి!!

మహర్షి ట్రైలర్ టార్గెట్ ఎన్టీఆర్…కాచుకోండి!!

374
0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి, కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా అవ్వడం తో అంచనాలు గట్టిగానే ఉన్నాయి, ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ లెవల్ లో జరుగుతుండగా ఈవెంట్ లో భాగంగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను 8 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ ట్రైలర్ కి టాలీవుడ్ తరుపునుండి తొలి 24 గంటల్లో బ్రేక్ చేయాల్సిన రెండు రికార్డులు ఉన్నాయి.

ట్రైలర్ ల విషయం లో బాహుబలి సినిమాను పక్కకు పెడితే తొలి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ రికార్డులు రెండు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా ట్రైలర్ పైనే ఉన్నాయి. అరవింద సమేత ట్రైలర్ 24 గంటల్లో 7.8 మిలియన్ వ్యూస్ ని రెండు చానెల్స్ లో అందుకుంది.

ఒక చానెల్ మాత్రమె కౌంట్ అవుతుంది కాబట్టి ఓవరాల్ గా 6.98 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉంది, ఇక లైక్స్ పరంగా 24 గంటల్లో 3 లక్షల 27 వేల లైక్స్ తో టాప్ లో ఉంది, ఈ రికార్డులు ఇప్పుడు మహర్షి ట్రైలర్ ముంగిట ఉన్నాయి. మరి 24 గంటల్లో మహర్షి ట్రైలర్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here