Home న్యూస్ సూపర్ స్టార్ పేరు లోనే 4 సినిమాలు…ఈ విచిత్రం చూశారా??

సూపర్ స్టార్ పేరు లోనే 4 సినిమాలు…ఈ విచిత్రం చూశారా??

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ ఎప్పటికప్పుడు తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటున్నాడు కానీ కొత్త మేక్ ఓవర్, కొత్త యాటిట్యూడ్ లాంటివి మాత్రం గత సినిమాల్లో మిస్ అయ్యాయి. కానీ ఈ సారి మాత్రం సర్కారు వారి పాట విషయానికి వస్తే ప్రీ లుక్ తోనే సరికొత్త మేక్ ఓవర్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేసి ఇప్పటి నుండే అంచనాలు పెరిగేలా చూసుకున్నాడు మహేష్ బాబు.

ఇక ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా టైటిల్ కన్ఫాం అవ్వడం తో మహేష్ ను ఫ్యాన్స్ పిలిచే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు లోనే టోటల్ గా 4 టైటిల్స్ రావడం జరిగింది, అది కూడా గత మూడు సినిమాలు ఇప్పుడు నాలుగో సినిమా గా సర్కారు వారి పాట ఎంటర్ అయ్యింది.

అదెలా అంటే… సూపర్ స్టార్ మహేష్ బాబు వర్డ్స్ లోని మొదటి లెటర్ తో తన లేటెస్ట్ సినిమాల పేర్లు అన్ని రావడం విశేషం అని చెప్పొచ్చు. SSMB అంటూ ఫ్యాన్స్ పిల్చుకునే మహేష్ పేరులో
S – #SarkaruVaariPaata
S – #SarileruNeekevvaru
M – #Maharshi
B – #BharatAneNenu

ఇలా లాస్ట్ మూడు సినిమాలతో పాటు ఇప్పుడు చేస్తున్న సర్కారు వారి పాట కూడా వచ్చి చేరింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… ఈ పేరు లో వచ్చిన సినిమాలు మూడు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ గా నిలవగా ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమా కూడా సెంటిమెంట్ లో భాగం అయితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో విజయం అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

ఓవరాల్ గా ఈ సెంటిమెంట్ హీరోల పేర్ల మీద ఇది వరకు కూడా ఒకరిద్దరి హీరోల విషయం లో జరగగా ఇప్పుడు మహేష్ కి కూడా జరిగింది, మరి ఈ సెంటిమెంట్ ప్రకారం సినిమా కూడా హిట్ అవుతుందా లేదా అని తెలియాలి అంటే మనం వచ్చే ఇయర్ వరకు ఎదురు చూడాల్సిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here