టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట మొదలు పెట్టక ముందే తన బాక్స్ ఆఫీస్ స్టామినా పవర్ ఏంటో చూపిస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ 3 విజయాలను నమోదు చేసి హాట్రిక్ ని పూర్తీ చేసిన సూపర్ స్టార్ ఈ ఇయర్ సంక్రాంతి కి సరిలేరు నీకెవ్వరు సినిమా తో కెరీర్ బెస్ట్ రికార్డులను క్రియేట్ చేశాడు.
ఈ సినిమా తర్వాత గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాను కమిట్ అయిన సూపర్ స్టార్ ఈ సినిమా ను త్వరలో మొదలు పెట్టబోతుండగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యి సంచలనం సృష్టించింది.
ఒక్క మ్యూజిక్ రైట్స్ తప్ప మిగిలిన రైట్స్ అన్నీ కూడా అమ్ముడు పోయిన ఈ సినిమా అల్టిమేట్ రికార్డ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది, సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రెండూ కలిపి ఏకంగా 35 కోట్ల దాకా రేటు పలకగా ఎవరు కొన్నారు అన్నది మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు.
ఇక సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 15 కోట్ల రేంజ్ లో పలకగా ఈ రెండు కలిపే ఏకంగా 50 కోట్ల బిజినెస్ చేసిన సర్కారు వారి పాట సినిమా… తమిళ్ లో కూడా డబ్ కాబోతుండగా అక్కడ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రెండూ కలిపి 7 కోట్ల సెన్సేషనల్ రేటు ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది.
దాంతో ఇవన్నీ కలిపి ఏకంగా 57 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న సర్కారు వారి పాట… సినిమా ఇంకా షూటింగ్ మొదలు పెట్టకుండానే మేజర్ బిజినెస్ తో దుమ్ము లేపగా ఇక మ్యూజిక్ రైట్స్ అలాగే థియేట్రికల్ బిజినెస్ లు కూడా కంప్లీట్ అయితే మరోసారి సెన్సేషనల్ బిజినెస్ తో మహేష్ కెరీర్ బెస్ట్ లను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.