2020 సంక్రాంతి మరింత జోరుగా ఉండబోతుంది, పోటిలో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు పోటి కి సిద్ధం అవుతున్నాయి… తెలుగు సినిమాల్లో మొత్తం మీద మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురం లో, కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా కి తోడూ ఇప్పుడు వెంకీ నాగ చైతన్య ల కాంబో లో లేట్ అవుతున్న వెంకీ మామ కూడా రేసులో ఎంటర్ అయింది.
కాగా అన్ని సినిమాలో తలో ఒక రోజు చూసుకుని రిలీజ్ కావచ్చు కానీ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురం లో మాత్రం ఒకే రోజు పోటి లో ఉండటానికి సిద్ధం అయ్యాయి. రెండు సినిమాలు జనవరి 12 న రిలీజ్ కానున్నాయు.
జనవరి 10 నుండి పక్కా వీకెండ్ మొదలు అవుతుంటే ఆ డేట్స్ ని వదిలి 12 న క్లాష్ లో రిలీజ్ ఎందుకు అవుతున్నాయి, ఆ డేట్ ని రజినీ మురగదాస్ ల దర్బార్ కి ఎందుకు ఇచ్చేశాయి అన్న చర్చలు గట్టిగా జరుగుతుండగా దానికి ఒక రీజన్ ఉంది అనేది ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్.
గతంలో మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే జనవరి 10 న రిలీజ్ అయ్యి ఆల్ టైం డిసాస్టర్ అయ్యింది. దాంతో మహేష్ కి మళ్ళీ ఆ డేట్ కి రావడం ఇష్టం లేదు. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ 25 వ సినిమా అజ్ఞాతవాసి కూడా జనవరి 10 నే రిలీజ్ అయింది. ఆ సినిమా ఎంతటి డిసాస్టరో అందరికీ తెలిసిందే.
అందుకే ఇప్పుడు మహేష్ అలాగే త్రివిక్రమ్ కూడా తమ సినిమాలను ఆ డేట్ కి రిలీజ్ చేయడానికి ఇష్టం లేక 12 న క్లాష్ కి సిద్దం అవుతున్నట్లు చెబుతున్నారు. ఆ డేట్ అంటే వాళ్లకి అచ్చి రాలేదు కాబట్టి నో చెప్పారు, మరి 11 న ఒక సినిమా 12 న మరో సినిమా రావచ్చు కదా అన్నది విశ్లేషకుల మాట… ఫైనల్ గా అలాగే జరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు.