సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ అనేవి కామన్, కానీ అప్పుడప్పుడు అవి హద్దులు దాటుతూ ఉంటుంది, రీసెంట్ టైం లో మన హీరోల ఫ్యాన్స్ కే కాకుండా ఇతర ఇండస్ట్రీ ల ఫ్యాన్స్ తో కూడా గొడవ పెరిగి పోతుంది, నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కోలివుడ్ స్టార్ హిరో విజయ్ ఫ్యాన్స్ కి మధ్య గొడవ జరిగింది.
ఎవరు మొదలు పెట్టారు అన్నది క్లియర్ గా తెలియకున్నా మహేష్ చేసిన ఒక్కడు, పోకిరి రీమేక్ లు చేసిన విజయ్ సినిమాలతో మహేష్ సినిమాలను కంపేర్ చేస్తూ మా హీరో నే బాగా చేశాడు అంటూ విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ మొదలు పెట్టారు.
తర్వాత మహేష్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయారు, దాంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా యాంటీ హాష్ టాగ్స్ తో రెచ్చిపోయారు, ఫస్ట్ విజయ్ ఫ్యాన్స్ మహేష్ పై 2 లక్షల 65 వేల ట్వీట్స్ వేసి ట్రెండ్ చేయగా మహేష్ ఫ్యాన్స్ ఏకంగా 4 లక్షల 55 వేలకు పైగా ట్వీట్స్ తో ట్రెండ్ చేసి దుమ్ము లేపారు.
ఓవరాల్ గా చూసుకుంటే ఎప్పుడైనా ఒరిజినల్ చేసిన వారికే ఎక్కువ పేరు వస్తుంది, రీమేక్ చేసే టైం లో ఇమ్ప్రోవైజేషన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు, ఒరిజినల్ చేసే టైం లో అది వర్కౌట్ అవుతుందో కూడా తెలియదు, అలా చూసుకున్నా మహేష్ విజయ్ సినిమాలను కంపేర్ చేసినా…
మహేష్ ఇంటన్సీ ముందు విజయ్ తేలిపోయాడు, అది వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఈ గొడవ జరిగి ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ శాంతించినా… ఇలాంటి కంపేరిజన్ గొడవలు మళ్ళీ జరిగే అవకాశం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు.