డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని ఎంచుకుని వాటితో ఒకటి తర్వాత ఒక సక్సెస్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న అడివి శేష్ 26/11 ముంబై అటాక్స్ నేపధ్యంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టొరీతో తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మేజర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. టీసర్ ట్రైలర్స్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉంది ఎలా మెప్పించింది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…. ముందుగా సినిమా కథ పాయింట్ కి వస్తే….
చిన్నప్పటి నుండి సైన్యంలో చేరాలి అనుకునే హీరో తన పేరెంట్స్ కి అది ఇష్టం లేకున్నా కానీ ట్రై చేస్తూ ఉంటాడు…. పేరెంట్స్ మొదట్లో నో చెప్పినా తర్వాత ఓకే అంటారు…. స్కూల్ లో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు హీరో, కానీ తనకి టైం ఇవ్వడంలేదని హీరోయిన్ తో గొడవలు అవుతూ ఉంటాయి….
ఇక సైన్యంలో చేరిన హీరో అక్కడ అంచలంచలుగా ఎదిగి NSG కమాండోలకు ట్రైనింగ్ ఇచ్చే రేంజ్ కి ఎదుగుతాడు, ఇలాంటి టైం లో ముంబైలో జరుగుతున్నా అటాక్స్ గురించి తెలుసుకుని హీరో ఏం చేశాడు, అక్కడ ఇరుక్కున్న ప్రజలను కాపాడానికి తన లైఫ్ ని ఎలా రిస్క్ చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
పెర్ఫార్మెన్స్ పరంగా సందీప్ ఉన్నికృష్ణన్ గా అడివి శేష్ లుక్ అద్బుతంగా సరిపోయింది, తన నటనకి ఎలాంటి వంక పెట్టడానికి లేదు, తన స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్స్ తో మెప్పించాడు అడివి శేష్… ఇక హీరోయిన్ సయు మంజ్రేకర్ పర్వాలేదు అనిపించగా ప్రకాష్ రాజ్ అండ్ రేవతి కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బాగున్నాయి, ఫస్టాఫ్ కొంచం టేక్ ఆఫ్ కి టైం పట్టగా…
ఇంటర్వెల్ నుండి అసలు కథ మొదలు అవుతుంది… సంగీతం సినిమాకి తగ్గట్లు మెప్పించగ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అద్బుతంగా ఆకట్టుకుంది. ఇంటర్వెల్ సీన్ టైం లో అలాగే సెకెండ్ లో కొన్ని కీలక షాట్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ బాగా మెప్పించగా డైరెక్షన్ విషయానికి వస్తే….
26/11 నేపధ్యంలో ఆల్ రెడీ చాలా సినిమాలే వచ్చాయి, కానీ ఆడియన్స్ కి ఓ మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కథ చెప్పి వాళ్ళకి నచ్చే విధంగా కథని అల్లుకోవడం అది చాలా వరకు ఆకట్టుకునే విధంగా ఉండటంతో మేజర్ చాలా బాగా మెప్పించింది, ఫస్టాఫ్ కొంచం టైం పట్టినా సెకెండ్ ఆఫ్ చివరి 40 నిమిషాలు సినిమా చాలా బాగా మెప్పిస్తుంది.. ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది, అప్పటి పరిస్థితులను మరోసారి కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది….
దాంతో మనకి తెలియకుండానే మనం ఉద్వేగానికి లోనవుతాం…. మొత్తం మీద మేజర్ రెగ్యులర్ మూవీ కాక పోయినా ఆడియన్స్ కి కావాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని మంచి ఎమోషన్స్ తో మిక్స్ చేసి చెప్పిన ఓ రియల్ లైఫ్ స్టొరీ…. సో మొత్తం మీద మేజర్ మాస్ట్ వాట్చ్ మూవీస్ లో ఒకటి అని చెప్పాలి…