భారీ గ్రాండియర్ తో సినిమాలు తీయడం, వాటిని ఆల్ రెడీ సక్సెస్ అయిన బిగ్ మూవీస్ తో పోల్చి ఈ సినిమా కూడా అలాంటి విజయాన్ని అందుకుంటుంది అన్న నమ్మకం వ్యక్తం చేయడం బాహుబలి సిరీస్ నుండి ఎన్నో సార్లు అన్ని ఇండస్ట్రీలు ట్రై చేశాయి, కానీ ఏ ఇండస్ట్రీ కూడా బాహుబలి లాంటి మ్యాజిక్ ని రీ క్రియేట్ చేయలేదు….
మలయాళ ఇండస్ట్రీ నుండి ఈ ప్రయత్నం ఎప్పటి కప్పుడు జరుగుతూనే ఉండగా అప్పట్లో మామంగం అనే భారీ బడ్జెట్ మూవీ తీయగా ఏమాత్రం అంచనాలను ఆ సినిమా అందుకోలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన కొత్త సినిమా మలైకోట్టై వాలిబన్(Malaikottai Vaaliban Movie)….
భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగి పోయాయి, పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలి అనుకున్నా థియేటర్స్ సమస్య వలన మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా రిపబ్లిక్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించినా కూడా…
వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది. ఓవరాల్ గా సినిమా 6 రోజుల్లో కేరళలో 12 కోట్లకు పైగా గ్రాస్ ను వసూల్ చేయగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 2 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ లో సినిమా 11.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని ఇప్పటి వరకు సొంతం చేసుకుంది.
దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 25.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది…. సినిమా భారీ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది అని ఎక్స్ పెర్ట్ చేశారు కానీ క్లైమాక్స్ పోర్షన్ విజువల్ గా ఎక్స్ లెంట్ గా ఉన్నా ఓవరాల్ సినిమా పెద్దగా ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక పోయిందని అంటున్నారు. భారీ నష్టాలనే ఈ సినిమా మిగిలించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.