Home న్యూస్ చంద్రముఖి ఒరిజినల్ మణిచిత్రతాళు రీ రిలీజ్ కలెక్షన్స్…కుమ్ముతుంది సినిమా!

చంద్రముఖి ఒరిజినల్ మణిచిత్రతాళు రీ రిలీజ్ కలెక్షన్స్…కుమ్ముతుంది సినిమా!

0

2005 టైంలో సౌత్ ని ఒక ఊపు ఊపేసిన సినిమా చంద్రముఖి (Chandramukhi) అన్ని చోట్లా ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే…ఈ సినిమా ఒరిజినల్ వర్శన్ వచ్చిన చాలా ఏళ్లకి రీమేక్ వర్షన్ లు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. సినిమా ఒరిజినల్ వర్షన్ 1993 టైంలో మోహన్ లాల్ మరియు శోభనల కాంబోలో…

మణిచిత్రతాళు(#Manichitrathazhu) పేరుతో మలయాళంలో రూపొందగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది….ఆ సినిమా ను కొంచం మర్చి కన్నడలో రీమేక్ చేయగా తర్వాత చంద్రముఖిగా రీమేక్ చేశారు…కానీ ఒరిజినల్ వర్షన్ ని హిందీలో అలాగే రీమేక్ చేయగా…

అక్కడ కూడా భారీ హిట్ గా నిలిచింది, ఇండియన్ మూవీస్ లో ఎక్కువ సార్లు రీమేక్ అయిన రేర్ మూవీస్ లో మణిచిత్రతాళు కూడా ఒకటిగా నిలుస్తుంది…అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి 31 ఏళ్ళు కంప్లీట్ అవ్వగా రీసెంట్ గా ఈ సినిమాను కేరళలో….

వరల్డ్ వైడ్ గా డీసెంట్ షోలతో రీ రిలీజ్ చేయగా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో దుమ్ము లేపుతుంది ఈ సినిమా….కేరళలో కొత్త సినిమాలను తట్టుకుని కూడా ఈ సినిమా 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇతర చోట్ల కూడా మంచి జోరుని చూపెడుతూ ఉండటం విశేషం… 30 ఏళ్ల క్రితం మూవీకి ఇలాంటి వసూళ్లు రావడం గ్రేట్ అనే చెప్పాలి.

మన దగ్గర ఎలాగైనా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుందో కేరళలో కూడా అప్పుడప్పుడు ఓల్డ్ మూవీస్ ని రీ రిలీజ్ చేస్తూ ఉండగా వాటిలో భాగంగా ఇప్పుడు వచ్చిన చంద్రముఖి ఒరిజినల్ మణిచిత్రతాళు లాంగ్ రన్ లో సాలిడ్ కలెక్షన్స్ తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here