కింగ్ నాగార్జున కెరీర్ లో కల్ట్ క్లాసిక్ అనిపించుకోదగ్గ సినిమాల్లో మన్మథుడు ఒకటి, అలాంటి సినిమాకి సీక్వెల్ గా మన్మథుడు 2 అంటూ సరికొత్త సినిమా తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు కింగ్ నాగార్జున, మరి మన్మథుడు 2 ఇప్పటికే ప్రీమియర్ షోల ను పూర్తి చేసుకుని అక్కడ నుండి ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది, మరి ఫైనల్ గా ఇక్కడ రెగ్యులర్ ఆడియన్స్ మనసును గెలుచుకుందో లేదో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ విషయానికి వస్తే….పెర్ఫ్యూమ్ బిజినెస్ చేసే హీరో తన లైఫ్ లో జరిగిన ఒక లవ్ ఇంసిడెంట్ వలన లవ్ కి దూరంగా ఉంటాడు, కానీ ఏజ్ అవుతున్నా పెళ్లి చేసుకోకపోవడం తో ఇంట్లో వాళ్ళు బలవంత పెడుతుండగా తన దగ్గర అసిస్టంట్ గా పనిచేసే హీరోయిన్ రకుల్ తో…
ఒక ఒప్పందం చేసుకుని తనకి లవర్ గా నటించమంటాడు, తర్వాత అతని లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నది అసలు కథ, సినిమా కథ మొదటి అర్ధభాగం వరకు చాలా ఎంటర్ టైన్మెంట్ తో కూడుకుని ఆకట్టుకునే విధంగా ఉంటుంది, హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీ, వెన్నెల కిషోర్ అండ్ రావ్ రమేష్ ల కామిక్ టైమింగ్ ఆకట్టుకుంటుంది.
దాంతో సరదా సరదా గా ఫస్టాఫ్ మొత్తం సాగిపోగా మంచి పాయింట్ తో ఇంటర్వెల్ వస్తుంది, దాంతో మన్మథుడు సినిమాకి న్యాయం చేసేలానే ఈ మన్మథుడు2 మొదటి అర్ధ భాగం ఉందని పిస్తుంది,(కానీ సాంగ్స్ పరంగా నిరాశ తప్పదు)… ఇక సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా….
సీరియర్ నోట్ తీసుకున్న సెకెండ్ ఆఫ్ అనుకోని సీన్స్ తో అక్కడ బోర్ కొట్టించడం ట్రాక్ తప్పడం జరుగుతుంది, అక్కడక్కడా వెన్నెల కిషోర్ మరియు రావ్ రమేష్ లు సేఫ్ చేయాలని ట్రై చేసినా అది కేవలం ట్రై వరకు మాత్రమె ఆగిపోతుంది, దాంతో ఫస్టాఫ్ ఇచ్చిన కిక్ లో సెకెండ్ ఆఫ్ సగం కూడా కిక్ ఇవ్వలేదు.
కానీ ఓవరాల్ గా ఫస్టాఫ్ అండ్ సెకెండ్ ఆఫ్ కలిపి చూస్తె పర్వాలేదు… ఒకసారి చూడొచ్చు అన్న ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్ బయటికి వస్తారు, ఇక నాగార్జున లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా రకుల్ తో కెమిస్ట్రీ కూడా బాగా సూట్ అయ్యింది అని చెప్పొచ్చు. వెన్నెల కిషోర్ అండ్ రావ్ రమేష్ చాలా సీన్స్ ఫుల్ ఫన్ ని కలిగించాయి.
ఇక సంగీతం విషయానికి వస్తే మన్మథుడు పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ తో పోల్చితే 10% కూడా ఇంపాక్ట్ ని చూపలేక పోయాయి పాటలు అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది, ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది,
ఇక డైరెక్షన్ పరంగా రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 అని టైటిల్ పెట్టకుండా ఉండి ఉంటే ఆ సినిమా పోల్చకుండా ఉండేవారు, కానీ అలా టైటిల్ పెట్టడం వలన ప్రతీసారి ఆ సినిమా తో పోల్చాల్చి వస్తుంది, అది సినిమాకి మైనస్ అయిందని చెప్పొచ్చు. వేరే టైటిల్ పెట్టి ఉంటే సినిమా డిఫెరెంట్ గా ఉండేది అండ్ మరింత గా ఆకట్టుకుని ఉండేది.
ఓవరాల్ గా డైరెక్టర్ గా మొదటి అర్ధభాగం వరకు సక్సెస్ అయినా సెకెండ్ ఆఫ్ విషయంలో అలాగే రొటీన్ క్లైమాక్స్ విషయం లో రాహుల్ సక్సెస్ కాలేదు. ఓవరాల్ గా సినిమా ఒకసారి చూసేలా ఉంది, మన్మథుడు తో పోల్చితే మాత్రం కొంత నిరాశ పరుచుతుంది అని చెప్పొచ్చు.
ఫైనల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…. ఫస్టాఫ్ ఆకట్టుకోవడం సెకెండ్ ఆఫ్ యావరేజ్ ఉన్నప్పటికీ కొంచం ఓపిక చేసుకుంటే పర్వాలేదు బాగానే ఉంది అన్న ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.