Home న్యూస్ అన్ని థియేటర్స్ ఏంటి సామి…అరాచకం అసలు!!

అన్ని థియేటర్స్ ఏంటి సామి…అరాచకం అసలు!!

0

     కింగ్ నాగార్జున మరియు రకుల్ ప్రీత్ సింగ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మన్మథుడు 2, మంచి అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఓవరాల్ గా 20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు అందులో 2 కోట్ల మేర ఓన్ రిలీజ్ ఉందని నిర్మాతలు కన్ఫాం చేయడంతో ఇప్పుడు సినిమా 18.5 కోట్ల బిజినెస్ అండ్ 19.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది.

కాగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ కౌంట్ పరంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతూ షాక్ ఇచ్చింది అని చెప్పొచ్చు. నైజాం లో రిలీజ్ మొదటి షో సమయానికి 220 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానున్న సినిమా సీడెడ్ లో 140 వరకు ఆంధ్రా మొత్తం మీద 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా 660 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలిపి 140 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది, ఇక ఓవర్సీస్ లో టోటల్ గా 250 కి పైగా లోకేషన్స్ లో సినిమా రిలీజ్ ని సొంతం చేసుకుంటుంది.

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 950 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానున్న మన్మథుడు2, రిలీజ్ మొదటి షో సమయానికి ఫైనల్ కౌంట్ 1000 ని టచ్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. రీసెంట్ టైం లో నాగ్ కెరీర్ లో ఇది హైయెస్ట్ రిలీజ్ కౌంట్ గా చెప్పుకోవచ్చు. ఇక సినిమా…

19.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుండగా ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళతో దుమ్ము లేపే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. మరి ఎంతవరకు అంచనాలను సినిమా అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here