Home న్యూస్ మార్కో మూవీ రివ్యూ….ఇది రక్తచరిత్ర సామి!!

మార్కో మూవీ రివ్యూ….ఇది రక్తచరిత్ర సామి!!

0

మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అయ్యి ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న మార్కో(Marco Movie) సినిమా అక్కడ దుమ్ము లేపగా తెలుగులో సినిమాను డబ్ చేసి న్యూ ఇయర్ కానుకగా ఆల్ మోస్ట్ 300 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే హీరో ఫ్యామిలీ ఒక పవర్ ఫుల్ మాఫియా ఫ్యామిలీ….వీళ్ళకి శత్రుత్వం ఉన్న మరో ఫ్యామిలీ అత్యంత క్రూరంగా హీరో ఫ్యామిలీని చంపేస్తారు…ఆ ఫ్యామిలీ స్టెప్ బ్రదర్ అయిన హీరో ఆ ఫ్యామిలీ చావుకి కచ్చితంగా రివేంజ్ తీర్చుకుంటానని ప్రామిస్ చేస్తాడు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మిగిలిన కథ…

మొత్తం మీద చాలా బేసిక్ రివేంజ్ స్టోరీ పాయింట్ తో సినిమా తెరకేక్కినా కూడా ఒక రక్తచరిత్ర లా సినిమా అంతా వైలెంట్ సీన్స్ తో నిండిపోతుంది…ఆ ఫైట్ సీన్స్ చంపడాలు లాంటివి…ఇలాంటి రక్తపాతం ఎక్కువగా ఉండే సినిమాలు ఇష్టపడని వాళ్ళకి…

అలాగే గర్బిణీ స్త్రీలకు అలాగే వీక్ హార్ట్ ఉండే వాళ్ళకి చూడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ అదే టైంలో కంప్లీట్ రివేంజ్ యాక్షన్, బ్లడ్ బాత్ తో కూడుకున్న సినిమాలు నచ్చే ఆడియన్స్ కి మాత్రం మార్కో మూవీ ఫీస్ట్ సినిమా అని చెప్పాలి…ఆ రేంజ్ లో యాక్షన్ సీన్స్ రివేంజ్ సీన్స్ తో నిండిపోయింది సినిమా…

ఇలాంటి యాక్షన్ మూవీస్ లో మర్డర్ లు మరీ ఎక్కువ అయినా చూడలేం కానీ ఆ మర్డర్ ల వెనక ఉన్న పెయిన్, రివేంజ్ ఎలాగైనా తీర్చుకోవాలని అనిపించేలా చేసిన కొన్ని సీన్స్ వలన రక్తపాతం ఎక్కువ అయినా కూడా ఆడియన్స్ సినిమా కోర్ పాయింట్ కి కనెక్ట్ అవుతారు…

అది కనెక్ట్ అవ్వడం వలెనే సినిమా మలయాళంలో భారీ విజయం దిశగా దూసుకు పోతుంది. ఉన్ని ముకుందన్ కంప్లీట్ మేక్ ఓవర్ తో కెరీర్ టర్నింగ్ మూవీ తో దుమ్ము లేపాడు…ఈ సినిమా తర్వాత తన గ్రాఫ్ మరింతగా పెరిగిపోవడం ఖాయమని చెప్పాలి…. 

బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్ ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది. ఓవరాల్ గా ఔట్ అండ్ ఔట్ బ్లడ్ బాత్ ని తలపించే ఈ రక్తచరిత్ర ఇలాంటి మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. రెగ్యులర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం మరీ ఇంత రక్తపాతం ఏంటి అనిపిస్తుంది కానీ ఒకసారి ఈజీగా చూడొచ్చు… సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here