బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ ఇండస్ట్రీ నుండి కేజిఎఫ్ సిరీస్ తర్వాత కాంతార లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన తర్వాత భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా రిలీజ్ అయిన ధృవ్ సార్జా(Dhruva Sarja) నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్(Martin Movie Collections) సినిమా…
మొదటి ఆటకే అట్టర్ ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా ఇక ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించ లేక పోయింది. తెలుగు రాష్ట్రాల్లో మాస్ సెంటర్స్ లో కొంచం పండగ టైంలో ఆక్యుపెన్సీని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి…
కూడా సొంతం చేసుకోగా ఓవరాల్ గా 5 రోజుల్లో 1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా షేర్ 80 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా.. తెలుగు వర్షన్ డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 3 కోట్లకు పైగానే షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది కానీ ఇక అది కష్టమే అని చెప్పాలి.
ఇక వరల్డ్ వైడ్ సినిమా ట్రేడ్ లెక్కల్లో 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Martin 5 Days Total WW Collections Report
👉Karnataka- 18.15Cr~
👉Telugu States- 1.80Cr~
👉ROI – 1.85Cr~
👉Overseas – 2.00CR~***(EST)
Total WW Collections – 23.80CR(11.85CR~ Share)
వరల్డ్ వైడ్ గా సినిమా బిజినెస్ లెక్కలు ఏమి బయటికి రాలేదు కానీ సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ రేంజ్ ను బట్టి మినిమమ్ 30 కోట్లకు పైగానే షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది అని అంచనా…ఆ లెక్కన సినిమా ఇంకా చాలా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.