బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ ఇండస్ట్రీ నుండి కేజిఎఫ్2, కాంతార లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మళ్ళీ అలాంటి సక్సెస్ లు సొంతం అవ్వలేదు, ఇలాంటి టైంలో ఎప్పుడో రావాల్సిన భారీ పాన్ ఇండియా మూవీ అంటూ చెప్పిన ధృవ్ సార్జా(Dhruva Sarja) నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్(Martin Movie Review And Day 1 Collections) మూవీ రీసెంట్ గా…
దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…కథ పాయింట్ కి వస్తే… మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టార్ అయిన మార్టిన్ కోసం అందరూ వెతుకుతూ ఉంటారు…అదే టైంలో పాకిస్థాన్ లో అనుకోకుండా ఇండియా నావికా దళానికి చెందిన…
రెండో హీరో(డ్యూయల్ యాక్షన్)దొరికిపోతాడు…దాంతో తన మెమొరీని తొలగించాలని నిర్ణయం తీసుకుని ఒక ఇంజక్షన్ ఇస్తారు….గతాన్ని కోల్పోయిన వ్యక్తికి మార్టిన్ కి ఉన్న లింక్ ఏంటి…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
బేసిక్ పాయింట్ బాగానే ఉన్నా ఓవర్ ది టాప్ అనిపించే ప్రతీ సీన్, ఓవర్ బిల్డప్స్ తో నిండిపోయి ఒక స్టేజ్ దాటాక పరమ బోరింగ్ గా మారిపోతుంది. దాంతో సహనానికి పరిక్ష పెట్టేలా మారిపోయే మార్టిన్ చికాకు తెప్పిస్తుంది. యాక్షన్ సీన్స్ కొన్ని బాగున్నా, హీరో డాన్స్ బాగా వేసినా…
ఓవరాల్ గా సినిమా మాత్రం మినిమమ్ ఆసక్తిని పెంచేలా లేక పోవడం మేజర్ మైనస్ పాయింట్…దాంతో సినిమా చూడాలి అంటే ఆడియన్స్ కి చాలా చాలా ఓపిక అవసరం అని చెప్పాలి. అంత ఓపిక ఉన్నా సినిమా అయ్యే సరికి ఆశలు మొత్తం ఆవిరి అయిపోతాయి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రేంజ్ లోపే గ్రాస్ ను అందుకోగా కర్ణాటకలో 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. టోటల్ గా ఇండియాలో 8 కోట్ల రేంజ్ లో ఓవర్సీస్ లో కోటి లోపే కలెక్షన్స్ ని రాబట్టింది అని అంచన…సినిమా కోసం భారీ బడ్జెట్ ను పెట్టారు. తెరుకోవాలి అంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది.