బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బడ్జెట్ తో రూపొందిన కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియా మూవీ అయిన మార్టిన్(Martin Movie Collections) సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది…ధృవ్ సార్జా(Dhruva Sarja) నటించిన ఈ పాన్ ఇండియా మూవీ అన్ని భాషల్లో రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజే ఓ రేంజ్ లో నెగటివ్ టాక్ ను సొంతం చేసుకోగా…
సినిమా చూసిన ఆడియన్స్ తలపోటు తెప్పించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కర్ణాటక ఏరియాలో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా మిగిలిన చోట్ల ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక చేతులు ఎత్తేసింది ఈ సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రన్ లో సినిమా 2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే ఇక్కడ 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉన్నా ఓవరాల్ గా డబుల్ డిసాస్టర్ గా నిలిచింది సినిమా…
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Martin Total WW Collections Report
👉Karnataka- 21.20Cr~
👉Telugu States- 2.15Cr~
👉ROI – 2.30Cr~
👉Overseas – 2.15CR~***(EST)
Total WW Collections – 27.80CR(13.60CR~ Share)
సినిమా ఓవరాల్ గా బడ్జెట్ పరంగా 75 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందింది అని అంచనా…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 30 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సినిమా వాల్యూ టార్గెట్ లో 17 కోట్ల రేంజ్ లో….
లాస్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ గా నిలిచింది…మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బడ్జెట్ పరంగా భారీ నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. కర్ణాటకలో కొంచం పర్వాలేదు అనిపించినా ఓవరాల్ గా మాత్రం డిసాస్టర్ రిజల్ట్ తో పరుగును కంప్లీట్ చేసుకుంది..