Home న్యూస్ మార్టిన్ లూథర్ కింగ్ మినీ రివ్యూ….హిట్టా-ఫట్టా!

మార్టిన్ లూథర్ కింగ్ మినీ రివ్యూ….హిట్టా-ఫట్టా!

0

సంపూర్నేష్ బాబు(Sampoornesh Babu) హీరోగా తమిళ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మండేలా సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్(Martin Luther King) మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఒరిజినల్ లో లాగే ఇక్కడ కూడా ఆడియన్స్ ను మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ కి వస్తే…ఊర్లో 2 కులాల మధ్య ఎప్పటి నుండో గొడవలు ఉండగా రెండు కులాల జనాలు సమానంగా ఉండగా ఆ ఊర్లో వచ్చిన ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కు సొంతం చేసుకున్న హీరో ఓటు కోసం రెండు వర్గాల వాళ్ళు ఏం చేశారు, ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మిగిలిన కథ అని చెప్పొచ్చు…

ఓవరాల్ గా కథ పాయింట్ బాగుండటం, కథ బ్యాగ్రౌండ్ ప్లజంట్ గా అనిపించడం, అక్కడక్కడా కామెడీ సీన్స్ బాగానే మెప్పించడం సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా కథ చాలా నెమ్మదిగా సాగడం, ఒక దశ దాటాక హీరో రోల్ మరీ అత్యషకి వెళుతుంది అన్నట్లు అనిపించడం లాంటివి మేజర్ గా డ్రా బ్యాక్స్ అవ్వగా సంపూర్నేష్ బాబు మరీ ఒరిజినల్ లో ఉన్నట్లు…

యొగిబాబుని మరిపించకపోయినా ఉన్నంతలో పర్వాలేదు అనిపించాడు.. ఓవరాల్ గా సీన్ టు సీన్ కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుని కొన్ని కామెడీ సీన్స్, ఊరి సన్నివేశాలు మెప్పించినా కూడా చాలా వరకు కథ రిపీటివ్ గా అనిపించడం, కథనం చాలా నెమ్మదిగా సాగడం లాంటివి మేజర్ గా నిరాశ పరిచాయి. అయినా కానీ…

రొటీన్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ మార్టిన్ లూథర్ కింగ్ కి పెద్దగా అంచనాలు లేకుండా వెళితే కొంచం కథనం నెమ్మదిగా సాగినా కూడా ఓవరాల్ గా సినిమా ఒకసారి చూసేలా ఉందనిపిస్తుంది అని చెప్పాలి…ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి కంపారిజన్ లు కూడా ఉండవు కాబట్టి వాళ్ళకి సినిమా ఇంకొంచం బెటర్ గా అనిపిస్తుంది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here