కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్… అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కానీ కరోనా వలన ఆగిపోగా సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా అప్పటి నుండి సినిమాను డిజిటల్ రిలీజ్ లో రిలీజ్ చేయించాలని అన్ని OTT యాప్స్ తెగ ట్రై చేస్తున్నాయి కానీ వేటిని కూడా మేకర్స్ పట్టించుకోవడం లేదు…
సినిమాను ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పి కన్ఫాం చేసినా కానీ ఆఫర్స్ మాత్రం ఆగలేదని సమాచారం. సినిమా కి బిగ్గెస్ట్ రేటు ఇప్పటి వరకు 125 కోట్ల నుండి 130 కోట్ల దాకా కూడా డైరెక్ట్ రిలీజ్ రేట్లు దక్కినా కానీ టీం అందుకు ఒప్పుకోలేదు.
దాంతో కొంత కాలం లైట్ తీసుకున్న OTT యాప్స్ మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నట్లు సమాచారం. సినిమా కోసం లీడింగ్ OTT యాప్స్ లో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తమిళ్ మరియు తెలుగు రెండూ కలిపి డైరెక్ట్ రిలీజ్ కోసం 145 కోట్ల రేంజ్ లో ఆల్ టైం రికార్డ్ రేటు ని ఆఫర్ చేసిందట.
ఈ రేంజ్ రేటు అంటే సినిమా థియేట్రికల్ బిజినెస్ కి సమానమైన బిజినెస్ ఆఫర్ అనే చెప్పాలి. సౌత్ లోనే కాదు ఇండియా లోనే OTT ఆఫర్స్ పరంగా ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ రేటు ఆఫర్ అని చెప్పాలి, ఈ రేంజ్ లో ఆఫర్ వచ్చినా కానీ టీం మాత్రం ఏమాత్రం తగ్గకుండా నో చెప్పేశారట.
సినిమాను ముందు చెప్పినట్లే థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని, తర్వాతే డిజిటల్ రైట్స్ అమ్ముతామని చెప్పుకోచ్చారట. సినిమాను ఇప్పుడు దీపావళి కి కుదరం లేదు కాబట్టి సంక్రాంతి రేసులో నిలపాలి అని ప్లాన్ చేస్తున్నారు టీం. పరిస్థితులు బాగుంటే సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్టర్ రాంపేజ్ కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు.