కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవ్వగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న థియేటర్స్ కౌంట్ ఎంత అనేది రివీల్ అయింది. సినిమా కోవిడ్ తర్వాత పరిస్థితులలో ఇండియా లో హైయెస్ట్ థియేటర్స్ కౌంట్ ని సొంతం చేసుకున్న సినిమాగా రికార్డు సృష్టించ నుండగా తమిళ్ తెలుగు లో కూడా సినిమా…
రికార్డ్ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ముందుగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే.. నైజాం లో 240 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సీడెడ్ లో 150 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది. ఇక ఆంధ్రాలో…
సినిమా 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 710 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇది విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ అని చెప్పాలి. ఇక సినిమా తమిళనాడులో టోటల్ గా…
700 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది, తమిళ్ కన్నా కూడా తెలుగు లోనే ఎక్కువ థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా లో 320 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా కేరళలో 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ మొత్తం మీద 250 కి తగ్గని థియేటర్స్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు సినిమా…
2300 రేంజ్ లో థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి రిలీజ్ ను సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేస్తుందో చూడాలి.