Home న్యూస్ మత్తు వదలరా2 ప్రీమియర్ షో టాక్…హిట్టా-ఫట్టా!

మత్తు వదలరా2 ప్రీమియర్ షో టాక్…హిట్టా-ఫట్టా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి పార్ట్ హిట్ తర్వాత పార్ట్ 2 మీద అంచనాలు పెరిగిపోవడం అన్నది కామన్ గా జరుగుతుంది….2019 టైంలో ఆడియన్స్ ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన మత్తు వదలరా(Mathu Vadalara Movie) మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఆ సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు…

5 ఏళ్ల తర్వాత మత్తు వదలరా2(Mathu Vadalara2 Review) రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న సినిమాకి ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా, మొదటి పార్ట్ కి కొనసాగింపుగా స్టార్ట్ అయ్యే సినిమా…

ఫస్టాఫ్ మొత్తం కూడా అక్కడక్కడా కొంచం డౌన్ అయినట్లు అనిపించిన ప్రతీ సారి సత్య చేసే హిలేరియస్ కామెడీ సీన్స్ తో మాస్ రచ్చ చేసి ఫస్టాఫ్ కే పైసా వసూల్ అనిపించే రేంజ్ లో మెప్పించిన తర్వాత సెకెండ్ ఆఫ్ లో కథ కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా…

మళ్ళీ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అలాగే సినిమా ఎండ్ అయ్యే తీరు బాగా మెప్పించగా ఓవరాల్ గా ఎండ్ అయ్యే టైంకి మొదటి పార్ట్ కి ఏమాత్రం తీసిపోని విధంగా పార్ట్2 మెప్పించింది అన్న టాక్ ఉంది సినిమాకి… సత్య కామెడీ, వెన్నెల కిషోర్ సీన్స్, టీవీ సీరియల్ కొనసాగింపు అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయని చెబుతూ ఉండగా…

మొత్తం మీద ఫస్టాఫ్ హిలేరియస్ గా సెకెండ్ ఆఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో ఉందని అంటున్నారు. మొత్తం మీద ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమాకి ఆడియన్స్ నుండి మంచి ప్రామిసింగ్ రెస్పాన్స్ వినిపిస్తుంది అని చెప్పాలి ఇప్పుడు. ఇక ఇదే రేంజ్ లో టాక్ అంతటా స్ప్రెడ్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రచ్చ చేసే ఛాన్స్ ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here