Home న్యూస్ “మట్కా” టీసర్ రివ్యూ….వరుణ్ తేజ్ కంబ్యాక్ మూవీ!!

“మట్కా” టీసర్ రివ్యూ….వరుణ్ తేజ్ కంబ్యాక్ మూవీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మీడియం రేంజ్ హీరోలలో ఒక టైంలో మంచి ఫామ్ లో ఉంది మినిమమ్ ప్రామిసింగ్ లెవల్ లో మెప్పించిన వాళ్ళలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ఒకరు, ఫిదాతో అదరగొట్టి తర్వాత తొలిప్రేమ మరియు గద్దలకొండ గణేష్ లాంటి హిట్స్ తో మంచి మార్కెట్ నే సొంతం చేసుకున్నా కూడా తర్వాత టైంలో…

ఎక్కువగా ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ చేసి వరుస పెట్టి నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ మార్కెట్ ని కోల్పోతూ వచ్చాడు. రీసెంట్ టైంలో చేసిన సినిమాల రిజల్ట్ లు తీవ్రంగా నిరాశ పరిచాయి. లాస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ మరీ తీవ్రంగా నిరాశ పరిచింది.

అయినా కూడా ఈ సారి మరో ఎక్స్ పెరిమెంట్ కం రగ్గుడ్ మూవీ తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు వరుణ్ తేజ్….డిఫెరెంట్ గెటప్స్ లో పీరియాడికల్ టచ్ తో వరుణ్ తేజ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ మట్కా(Matka Teaser Review) ఆడియన్స్ ముందుకు నవంబర్ లో…

రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు…టీసర్ లో కాన్సెప్ట్ ఓకే అనిపించేలా ఉన్నప్పటికీ కథని పెద్దగా రివీల్ చేయకున్నా వరుణ్ తేజ్ డిఫెరెంట్ గెటప్స్ లో చాలా బాగా ఆకట్టుకున్నాడు…ముఖ్యంగా ఓల్డ్ గెటప్ లో…

తన లుక్ అండ్ యాటిట్యూడ్ ఓ రేంజ్ లో మెప్పించింది. అతి సామాన్యుడు ఎలా అత్యంత బలంగా ఎలా మారాడు, ఈ క్రమంలో ఫేస్ చేసిన సమస్యలు, వాటికి హీరో ఎలా అధిగమించాడు అన్న కాన్సెప్ట్ తో రూపొందినట్లు అనిపించిన మట్కా టీసర్ వరకు బాగానే ఇంప్రెస్ చేసింది…

బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా టీసర్ లో ఆకట్టుకోగా, సినిమా కూడా ఇదే రేంజ్ లో మెప్పిస్తే కచ్చితంగా వరుణ్ తేజ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న వరుణ్ తేజ్ ఎంతవరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here