Home న్యూస్ హీరోయిన్ తిట్టిన ఫ్యాన్స్…హీరో ని టార్గెట్ చేసిన హీరోయిన్!

హీరోయిన్ తిట్టిన ఫ్యాన్స్…హీరో ని టార్గెట్ చేసిన హీరోయిన్!

1

 

సోషల్ మీడియా ఉన్నది భావ వ్యక్తీకరణ కోసమే… కానీ కొందరు అప్పుడప్పుడు హద్దులు దాటి కూడా కామెంట్స్ చేస్తారు. ఇక హీరోల ఫ్యాన్స్ విషయం లో ప్రతీ హీరో ఫ్యాన్స్ లో కొందరు సోషల్ మీడియా లో తరచూ ఇతరుల పై నెగటివ్ కామెంట్స్, లేదా భూతులతో కూడిన కామెంట్స్ చేయడం మామూలే… హీరోలు ఎన్నో సార్లు ఇలాంటి వాళ్ళు తమ ఫ్యాన్స్ కాదని చెప్పినా వీరు వారిని పట్టించుకోరు..

Guntur Area All Time Top 10 Share Movies

లేటెస్ట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కొందరు సోషల్ మీడియా లో హీరోయిన్ ని తిట్టారు, ఎంతలా అంటే పర్సనల్ లైఫ్ ని ఫ్యామిలీ ని కూడా ఇన్వాల్వ్ చేసి తిట్టారు, దాంతో హీరోయిన్ సోషల్ మీడియా లో వీళ్ళ పై ఫైర్ అవుతూ నీ ఫ్యాన్స్ నిర్వాకం చూడు అంటూ ఎన్టీఆర్ ని టాగ్ చేస్తూ…

Krishna Area All Time Top 10 Share Movies

కామెంట్స్ పెడుతూనే ఉంది, వివరాల్లోకి వెళితే సోషల్ మీడియా లో చిట్ చాట్ సెషన్ పెట్టిన పవన్ కళ్యాణ్ బంగారం లో నటించిన మీరా చోప్రా ని తమ హీరో గురించి ఒక్క మాట చెప్పు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్ పెట్టాడు. ఈ హీరోయిన్ కి ఎన్టీఆర్ గురించి…

చెప్పాలి అనిపిస్తే చెప్పి ఉండొచ్చు లేదా సింపుల్ గా ఆ ప్రశ్న ని స్కిప్ చేసి ఉండొచ్చు, కానీ ఫ్యాన్స్ హార్ట్ అయ్యేలా నాకు ఎన్టీఆర్ ఎవరో తెలియదు, నేను అతని ఫ్యాన్ కాదని చేసిన కామెంట్స్ తో ఫ్యాన్స్ లో కొందరు తీవ్రంగా హార్ట్ అయ్యారు. దాంతో ఇక మీరా చోప్రా ని తిట్టడం మొదలు పెట్టగా…

మీరా చోప్రా సడెన్ గా హీరో ని టాగ్ చేస్తూ మీ ఫ్యాన్స్ నిర్వాకం చూడు అంటూ కామెంట్స్ పెడుతూ నాకు మహేష్ బాబు అంటే ఇష్టం నువ్వు ఇష్టం లేదంటే ఫ్యాన్స్ నన్ను తిడుతున్నారు అంటూ మహేష్ బాబు ని ఇన్వాల్వ్ చేసింది. దాంతో రచ్చ మరింత పెరిగి పోటా పోటిగా ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టడం అదే పనిగా మీరా చోప్రా వాటిని హైలెట్ చేస్తూ కామెంట్స్ పెట్టడం జరిగింది.

మొత్తం గొడవ చూసిన తర్వాత ఇక్కడ ఫ్యాన్స్ ది ఎంత తప్పు ఉందో హీరోయిన్ ది కూడా అంతే తప్పు ఉందని చెప్పొచ్చు.. తమ హీరో గురించి ఎవరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఫ్యాన్స్ కి ఉంటుంది, కానీ అదే సమయం లో చెప్పడం చెప్పకపోవడం ఎదుటివారి ఇష్టం… వారి చెప్పింది ఇష్టం లేక పొతే నెగటివ్ కామెంట్స్ చేయడం తప్పు..

ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ నుండి ఎక్స్ పెర్ట్ చేసింది ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు ఎం చెప్పినా తీసుకోవాలి… లేదా ఇలాంటి ప్రశ్న లను అందరినీ అడగడం ఆపేయాలి.. అదే సమయం లో ఫ్యాన్స్ ని హార్ట్ చేసేలా కామెంట్స్ చేయడం కూడా తప్పే.. ఎన్టీఆర్ ఎవరో తెలియదు అన్న మీరా చోప్రా…

2008 టైం లో ఎన్టీఆర్ తో ఓ సినిమా కూడా కమిట్ అయ్యింది కానీ ఆ సినిమా నుండి చివరి క్షణంలో ఆమె ని తీసేసి వేరే హీరోయిన్ ని తీసుకున్నారు, అది మనసులో పెట్టుకునే ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేసింది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు.

ఫ్యాన్స్ కొందరు హద్దు మీరి ఫ్యామిలీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి తిడ్డటం తో అందరూ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దే తప్పు అంటున్నారు. తప్పు రెండు వైపులా ఉంది కానీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేసి ఫ్యాన్స్ వైపు ఎక్కువ ఉంది. మరి ఈ ఇష్యూ త్వరగా సెటిల్ అవుతుందో లేదో చూడాలి… ఈ ఇష్యూ పై మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి….

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here