Home న్యూస్ నాగచైతన్య మాస్…6 కోట్ల తో సెన్సేషన్!!

నాగచైతన్య మాస్…6 కోట్ల తో సెన్సేషన్!!

0

యువ సామ్రాట్ నాగ చైతన్య ఇప్పుడు ఒక్క సినిమా హిట్ తో అల్టిమేట్ జోష్ మీదున్నాడు, కెరీర్ లో అడపా దడపా హిట్స్ అండ్ ఫ్లాఫ్స్ పడుతూనే ఉన్నా లాస్ట్ వచ్చిన మజిలీ తో నాగ చైతన్య రేంజ్ అండ్ క్రేజ్ బాగా పెరిగి పోయాయి. ఆ సినిమా తో కెరీర్ లో మొట్ట మొదటి 40 కోట్ల షేర్ మార్క్ అందుకుని సంచలనం సృష్టించిన నాగ చైతన్య ఆ సినిమా తర్వాత…

ఫిదా తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టిన శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంకా కొంచం షూటింగ్ బాలెన్స్ ఉన్న ఈ సినిమా లాక్ డౌన్ కనుక లేకుండా ఉంటే…

ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది, ఇక ఈ సినిమా బిజినెస్ కి లాక్ డౌన్ ఎఫెక్ట్ అయినా కానీ నాన్ థియేట్రికల్ బిజినెస్ మాత్రం యమ జోరు గా సాగుతుందని సమాచారం. లేటెస్ట్ గా సినిమా డిజిటల్ రైట్స్ సాలిడ్ రేటు కి అమ్ముడు పోయాయని ట్రేడ్ వర్గాల్లో రివీల్ అయ్యింది.

నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ రేటు తో స్ట్రీమింగ్ రైట్స్ 6 కోట్ల రేటు పలికి దుమ్ము దుమారం చేసింది. అల్లు అరవింద్ మొదలు పెట్టిన ఆహా వీడియో వారు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని సాలిడ్ రేటు చెల్లించి దక్కించు కున్నారు. ఆహా యాప్ లో ఇదే ఇప్పుడు హైయెస్ట్ పైడ్ మూవీ గా చెప్పుకోవచ్చు.

ఇక సినిమా షూటింగ్ లాక్ డౌన్ తర్వాత మిగిలిన పోర్షన్ ని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు ఈ ఇయర్ లోనే తీసుకు వచ్చే అవకాశం ఉందీ కానీ అది ఏ డేట్ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పొచ్చు, దీపావళి కి రావొచ్చని ఓ టాక్ ఇండస్ట్రీ లో ఉంది కానీ అది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here