Home గాసిప్స్ పవర్ స్టార్ చేయాల్సిన సినిమా…ఇప్పుడు చిరు చేతిలో!!

పవర్ స్టార్ చేయాల్సిన సినిమా…ఇప్పుడు చిరు చేతిలో!!

0

ఇతర భాషల నుండి వచ్చిన సినిమాల్లో కొన్ని సినిమాలు తెలుగు లో రీమేక్ అవుతాయి అన్న వార్తలు ఎప్పుడూ వస్తు ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు కేవలం రూమర్స్ గా మాత్రమె మిగిలిపోతాయి… కోలివుడ్ నుండి టాలీవుడ్ లో కి వస్తుంది అనుకున్న కొన్ని సినిమాల్లో అజిత్ కుమార్ నటించిన వేదాలం సినిమా కూడా ఒకటి. అజిత్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా తెలుగు లో రీమేక్….

అవుతుందని ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. ముందుగా ఎన్టీఆర్ పేరు వినిపించగా… సినిమా కథ తాను చేసిన ఊసరవెల్లి ని పోలి ఉండటం తో ఎన్టీఆర్ నో చెప్పాడు, తర్వాత ఇదే కథ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళింది.

పవర్ స్టార్ ఆల్ మోస్ట్ కన్ఫాం అనేశాడని టాక్ వచ్చింది కానీ ఎందుకనో ఈ సినిమా కాకుండా పవన్ ఆ టైం లో కాటమరాయుడు సినిమా చేశాడు, దాంతో ఈ సినిమా పేరు క్రమం గా టాలీవుడ్ లో వినిపించడం ఆగిపోగా ఇప్పుడు మళ్ళీ వినిపించడం మొదలు అయింది. డానికి కారణం మెగాస్టార్ చిరంజీవి.

ప్రస్తుతం యమ జోరు మీదున్న మెగాస్టార్ కొరటాల తో చేస్తున్న ఆచార్య తర్వాత తన స్పీడ్ ని మరింత పెంచి ఇయర్ కి 2 సినిమాలు చేయాలి అన్న కసితో ఉన్నాడు, దాంతో వరుస పెట్టి సినిమా లు కమిట్ అవుతున్న మెగాస్టార్ తన అప్ కమింగ్ మూవీస్ లిస్టులో ఇప్పుడు ఈ సినిమా ను కూడా యాడ్ చేశాడని లేటెస్ట్ టాక్.

దాంతో పవర్ స్టార్ దగ్గర ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు తిరిగి మెగాస్టార్ దగ్గరకు చేరడం తో తన రేంజ్ కి కొన్ని మార్పులు చేస్తే సినిమా బాగానే సెట్ అయ్యే చాన్స్ ఉందని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. మరి మెగాస్టార్ ఎప్పుడు ఈ సినిమా ను రీమేక్ చేస్తాడు అన్న న్యూస్ మాత్రం ఇంకా రివీల్ అవ్వాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here