Home గాసిప్స్ చిన్న సినిమా అన్నారు….మేమ్ ఫేమస్ కి బడ్జెట్ ఎంత అయ్యిందంటే!

చిన్న సినిమా అన్నారు….మేమ్ ఫేమస్ కి బడ్జెట్ ఎంత అయ్యిందంటే!

0

ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు మంచి హైప్ నడుమ రిలీజ్ అయిన సినిమా మేమ్ ఫేమస్, పేరుకు చిన్న సినిమానే అయినా కూడా ప్రమోషన్స్ పరంగా భారీ ప్రమోషన్స్ నే జరుపుకుని ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా.. రీసెంట్ టైంలో కొన్ని మీడియం రేంజ్ మూవీస్ కి కూడా ఇలాంటి ప్రమోషన్స్ అయితే జరగలేదు అని చెప్పాలి…

అలాంటి ఈ సినిమాను ఎంత బడ్జెట్ లో తెరకెక్కించారు అన్నది ఆసక్తిగా మారగా ట్రేడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఓవరాల్ గా బడ్జెట్ అటూ ఇటూగా 2.4 కోట్ల రేంజ్ లో అయ్యిందని అంటున్నారు, కానీ సినిమా ప్రమోషన్స్ అండ్ ప్రింట్ ఖర్చులు కలిపి మొత్తం మీద…

3 కోట్ల మేర బడ్జెట్ తో ఓవరాల్ గా సినిమా రూపొందింది అని ట్రేడ్ లో టాక్ ఉంది. సినిమా బడ్జెట్ కి బయట జరిగిన ప్రమోషన్స్ కి అస్సలు సంభందం లేదు అనే చెప్పాలి. టాక్ కొంచం బెటర్ గా వచ్చి ఉంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతాలను సృష్టించి ఉండేది కానీ ఇప్పుడు కూడా యూత్ లో…

సినిమాకి డీసెంట్ టాక్ ఉండటంతో యూత్ ఆడియన్స్ సపోర్ట్ తో సినిమా కి డీసెంట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా ద్వారా మేకర్స్ కి ఎలాంటి ప్రాఫిట్స్ సొంతం అయ్యాయి అన్న వివరాలు ఇంకా క్లియర్ గా రివీల్ అవ్వలేదు, అవి రివీల్ అయ్యాక ప్రాఫిట్-లాస్ వివరాలను అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here