బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ మీటర్ ఆడియన్స్ ముందుకు వచ్చి మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. తన కెరీర్ లో కమర్షియల్ సక్సెస్ అవుతుంది అనుకున్న ఈ సినిమా కిరణ్ అబ్బవరంకి అనుకున్న దానికి మించి నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం అయ్యేలా చేసింది. మొదటి రోజే పట్టుమని 20 లక్షల షేర్ ని కూడా అందుకోలేక పోయిన ఈ సినిమా…
రెండో రోజు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకోగా మూడో రోజు సండే అయినా కూడా మరోసారి నెగటివ్ షేర్స్ ని అందుకుని అత్యంత తీవ్రంగా నిరాశ పరిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర… మొత్తం మీద వీకెండ్ లో ఓవరాల్ గా అన్ని డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీసేస్తే…
సినిమా పోస్టర్స్ ఖర్చులు కూడా తీసుకు రాలేక పోయిన ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ 5 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ని పెట్టారని ట్రేడ్ లో టాక్ ఉంది. చిన్న సినిమానే అన్నా కూడా 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి పబ్లిసిటీ ఖర్చులు కూడా బాగానే అవ్వగా సినిమా మొత్తం మీద…
ఆ ఖర్చులను కూడా వెనక్కి తీసుకు రాలేక పోయింది ఇప్పుడు….మొత్తం మీద కిరణ్ అబ్బవరం కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలిచిన ఈ సినిమా తేరుకోలేని దెబ్బ కొట్టింది అని చెప్పాలి ఇప్పుడు. ఇక ఇలాంటి ఫ్లాఫ్ తర్వాత కిరణ్ అబ్బవరం తన అప్ కమింగ్ మూవీస్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.