బాక్స్ ఆఫీస్ దగ్గర థియేట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా ఆడియన్స్ ముందుకు డిజిటల్ రిలీజ్ గా వచ్చిన సినిమాలలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా కూడా ఒకటి… లాస్ట్ ఇయర్ నవంబర్ ఎండ్ టైం లో అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమా కి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పాలి. దాంతో ప్రైమ్ లో ఈ సినిమా కి..
సాలిడ్ వ్యూస్ కూడా దక్కాయి. ఇక తర్వాత ఈ సినిమా ను లీడింగ్ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగు వాళ్ళు 1.5 కోట్ల ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు. కాగా సినిమా ను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ కూడా చేశారు. కాగా సినిమా కి…
ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన టైం లో మంచి TRP రేటింగ్ సొంతం అయింది అని చెప్పాలి. సినిమా కు మొత్తం మీద 5.71 TRP రేటింగ్ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు సొంతం అయింది. ఇది నిజంగానే అద్బుతమైన TRP రేటింగ్ గా చెప్పుకోవాలి. పెట్టిన రేటు చాలా తక్కువే కాబట్టి…
జీ తెలుగు వాళ్లకి ఫస్ట్ టైం టెలికాస్ట్ తోనే ఈ సినిమా సాలిడ్ ప్రాఫిట్స్ ని ఇచ్చింది అని చెప్పాలి. ఆల్ మోస్ట్ పెట్టిన రేటు కి డబుల్ ప్రాఫిట్ ను ఫస్ట్ టైం టెలికాస్ట్ తోనే సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ టైం లో కొన్ని పెద్ద సినిమాల రేంజ్ కి మించి రేటింగ్ ను సొంతం చేసుకోవడం విశేషం, డిజిటల్ రిలీజ్ అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా సినిమా ను…
ప్రైమ్ లో చూడక పోవడం లాంటివి టెలివిజన్ లో మంచి రేటింగ్ సొంతం అయ్యేలా చేసింది అని చెప్పాలి. మొదటి సినిమా దొరసాని నిరాశ పరిచినా కానీ ఈ సారి మిడిల్ క్లాస్ మెలోడిస్ అంటూ ఆనంద్ దేవరకొండ అటు డిజిటల్ లో ఇటు టెలివిజన్ లో మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి..