విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా దొరసాని డిసాస్టర్ రిజల్ట్ తర్వాత చేస్తున్న రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్…. చిన్న కాన్సెప్ట్ తో ఆకట్టుకునే స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా ను థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నారు కానీ కుదరక ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే, అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సినిమాను… 4.5 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా….
సినిమా ఇప్పుడు ఈ నెల 20 న డైరెక్ట్ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, ఇక సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది, హోటల్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లో కథ పాయింట్ ని…
ఎంటర్ టైన్ మెంట్ వె లో చెప్పడం అది కనెక్ట్ అయ్యే విధంగా ఉండటం తో సినిమా పై అంచనాలు ఇప్పుడు బాగానే ఉండగా ట్రైలర్ కి కూడా రెస్పాన్స్ ఊహించని రేంజ్ లో వచ్చింది అని చెప్పాలి. మొదటి 24 గంటల్లో మీడియం రేంజ్ హీరోల లెవల్ లో….
ఈ సినిమా ట్రైలర్ కి వ్యూస్ దక్కడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది, సినిమా ట్రైలర్ కి మొదటి 24 గంటల్లో 4 మిలియన్స్ కి పైగా అప్ డేటెడ్ వ్యూస్ దక్కాయి, ఇవి చాలా వరకు మీడియం రేంజ్ హీరోల సినిమాలకు మొదటి 24 గంటలలో దక్కే వ్యూస్ గా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అమెజాన్ ప్రైమ్ తమ ప్లాట్ ఫాం లో రిలీజ్ అవుతున్న….
సినిమాల ట్రైలర్ లు ఎక్కువ శాతం యాడ్స్ ద్వారా మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తారు అన్న విషయం తెలిసిందే, ఈ సినిమా ట్రైలర్ విషయం లో కూడా ఇదే జరిగిందని చెప్పొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నది మాత్రమె కౌంట్ అవుతుంది, ఆ లెక్కన 4 మిలియన్స్ వ్యూస్ తో దుమ్ము లేపిన ఈ ట్రైలర్ సినిమా పై క్రేజ్ పెరిగేలా చేసింది.