రీసెంట్ టైం లో తెలుగు సినిమాలు ఎక్కువగా కన్నడలో డబ్ అవుతూ టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే… అక్కడ ఇది వరకు డబ్బింగ్ మూవీస్ ని ప్రమోట్ చేసే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు కన్నడ లో డబ్ అవుతూ ఉన్న నేపధ్యంలో ప్రతీ సినిమా అక్కడ ఒక్కొటిగా డబ్ అవుతుంది, లేటెస్ట్ గా అక్కడ తెలుగు సినిమాల పరంగా మరో 2 సినిమాలు టెలికాస్ట్ అవ్వగా వాటి TRP రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి.
ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మిర్చి అలాగే అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమాలు రెండూ కూడా అక్కడ డబ్ అయ్యి అక్టోబర్ 4 న స్టార్ సువర్ణ ఛానెల్ లో టెలికాస్ట్ చేశారు. కాగా రెండు సినిమాలకు అక్కడ షాకింగ్ గా లో రేటింగ్స్ వచ్చాయి.
అక్కడ మిగిలిన ఛానెల్స్ తో పోల్చితే స్టార్ సువర్ణ ఛానెల్ ని చాలా తక్కువగా చూస్తారు అన్న విషయం అరవింద సమేత డబ్ వర్షన్ టెలికాస్ట్ అయినప్పుడే తెలిసింది, ఆ సినిమా అంచనా వేసిన రేటింగ్ ని అందుకోలేక 3 రేటింగ్ తో సరి పెట్టుకోగా ఇప్పుడు అదే ఛానెల్ లో…
టెలికాస్ట్ అయిన మిర్చి మరియు నా పేరు సూర్య సినిమాలు కూడా యావరేజ్ రేటింగ్ తోనే సరిపెట్టుకున్నాయి, మిర్చి సినిమా కి 2.81 TRP రేటింగ్ దక్కగా నా పేరు సూర్య సినిమా కి 2.94 రేటింగ్ దక్కింది, మిర్చి సినిమా ను అక్కడ సుదీప్ అప్పటికే రీమేక్ చేసి ఏళ్ళు అవుతున్నా ఈ సినిమాకి ఓవరాల్ గా మంచి రేటింగే దక్కింది అని చెప్పాలి.
ఇక నా పేరు సూర్య సినిమా కన్నడ లో డబ్ అయ్యి భారీ వ్యూస్ ని యూట్యూబ్ లో సొంతం చేసుకుంది, అది కూడా ఇంపాక్ట్ చూపి ఉండొచ్చు. కారణాలు ఏదైనా కానీ మిగిలిన రీసెంట్ మూవీస్ తో పోల్చితే ఈ రెండు సినిమాలకు మరీ అనుకున్న రేంజ్ లో అయితే రేటింగ్స్ రాలేదు అనే చెప్పాలి.