Home న్యూస్ మూతోన్‌ మూవీ రివ్యూ….ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూసి ఉండరు!

మూతోన్‌ మూవీ రివ్యూ….ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూసి ఉండరు!

0

ఆహా వీడియో వాళ్ళ వలన ఇతర భాషల సినిమాలు ముఖ్యంగా మలయాళం లో అద్బుతమైన కంటెంట్ తో తెరకెక్కే సినిమాలను తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తుండటం, ఆ డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని ఇష్టపడే వారికి తెలుగు లో ఆ సినిమాలు దొరుకుతుండటం తో ప్రతీ వారం ఎదో ఒక సినిమా మెప్పిస్తూనే ఉంది, ఈ వారం ప్రేమమ్ ఫేం నివిన్ పాలి నటించిన మూతోన్ సినిమాను తెలుగు లో తీసుకువచ్చారు.

సినిమా ఎలా ఉంది అన్న విశేషాలను గమనిస్తే… ముందుగా కథ పాయింట్ కి వస్తే… లక్ష దీప్ లో ఉండే ఓ చిన్న కుర్రాడు, తప్పిపోయిన తన అన్నయ్య కోసం ముంబై వెళతాడు, ముంబై వెళ్ళాక అనేక అవరోధాలను ఎదురుకుని చివరికి ఒక హోటల్ లో పని చేస్తూ ఉండగా…

అనుకోకుండా కిడ్నాప్ అవుతాడు…. ఆ కిడ్నాప్ చేసింది ఎవరో కాదు తను వెతుకుతూ వచ్చిన అన్నయ్య అయిన హీరో… అక్కడ పెద్ద దాదా అయిన హీరో చేసేవన్నీ ఇల్లీగల్ పనులు… చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముతాడు… అప్పుడు హీరో కి ఆ పిల్లాడి గురించి తెలుస్తుంది…

తర్వాత చిత్ర విచిత్రమైన ట్విస్ట్ లతో సినిమా ఊహకందని మలుపులు తిరిగుతుంది, తర్వాత ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో అందరికీ నటనకి సమాన స్కోప్ ఉండగా ప్రతీ ఒక్కరు కూడా అద్బుతంగా నటించి మెప్పిస్తారు.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరీ స్లోగా ఉండదు, మరీ ఫాస్ట్ గా ఉండదు, కానీ చూసే టైం లో ఏమాత్రం విసుగు చెందకుండా టైం అలా అలా గడుస్తూ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. సినిమా కాన్సెప్ట్ ఎంత డిఫెరెంట్ గా ఉందో సినిమా మొత్తం కూడా అంతే డిఫెరెంట్ గా అనిపిస్తూ థ్రిల్ చేస్తుంది.

మొత్తం మీద ఫస్టాఫ్ కొంచం స్లోగా సాగినా కానీ ఇంటర్వెల్ నుండి సినిమా లెవల్ మారిపోతుంది, సెకెండ్ ఆఫ్ లో వచ్చే టర్న్ లు ట్విస్ట్ లు ఊహించి ఉండరు, ఇక క్లైమాక్స్ కూడా అద్బుతంగా మెప్పించి మొత్తం మీద సినిమా చూసిన తర్వాత కూడా ఈ సినిమా గురించి ఆలోచించేలా చేస్తుంది…

డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వారు, కొత్త తరహా కథలను ఇష్టపడే వారికి సినిమా బాగా నచ్చే అవకాశం ఉంటుంది, రొటీన్ మూవీస్ చూసే వారు కూడా కొంచం బోర్ కొట్టినా ఒకసారి ఈజీగా చూడొచ్చు. మొత్తం మీద మలయాళం నుండి వచ్చిన మరో డిఫెరెంట్ అండ్ యూనిక్ మూవీ ఈ మూతోన్.. సినిమా కి మా రేటింగ్ 3/5….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here