బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన కలెక్షన్స్ ఒకటి అయితే అప్పుడప్పుడు నిర్మాతలు సినిమాల కలెక్షన్స్ పెంచి చెబుతూ ఉంటారు, సినిమా పబ్లిసిటీ కోసమో లేక హీరోల రికార్డుల కోసమో కానీ ఇలా ఎక్కువ కలెక్షన్స్ చూపెట్టడం అన్నది నిర్మాతలకు కామన్ అనే చెప్పాలి. సాధారనంగా సినిమాల కలెక్షన్స్ గురించి ఎలాంటి ఐడియా లేని ఫ్యాన్స్ నిర్మాతలు వదిలిన పోస్టర్స్ ని నిజం అనుకుంటూ ఉంటారు. కానీ అన్ని ఏరియాలలో కలెక్షన్స్ ని ట్రాక్ చేసే…
ట్రాకర్స్ వచ్చిన కలెక్షన్స్ ని చెబితే అవి నిజం కాదని నిర్మాతలు చెప్పిందే నిజం అని, అలా ఎక్కువ చెబితే IT రైట్స్ జరుగుతాయి కదా అంటూ డిఫెండ్ చేసుకోవడానికి అనేక కామెంట్స్ చేస్తారు కానీ నిర్మాతలు అలా IT రైడ్స్ జరిగినా కానీ ఎదో పబ్లిసిటీ కోసం వేసిన పోస్టర్స్ అంటూ…
చాలా సింపుల్ గా చెప్పేస్తారు… లేదంటే… ఇలా ఎక్కువ కలెక్షన్స్ పోస్టర్స్ వేసిన వెంటనే IT రైడ్స్ అయితే చాలా మంది పై కేసులు ఎప్పుడో పడేవి… కానీ అలా జరగలేదు… వీటి గురించి సామాన్య ప్రేక్షకులకు పెద్దగా ఐడియా ఉండదు కాబట్టి ఎవరు ఎక్కువ చెబితే అదే నిజం అనుకుంటూ ఉంటారు..
లేటెస్ట్ గా కర్ణాటకలో టాప్ హీరోలలో ఒకరైన దర్శన్ నటించిన రాబర్ట్ అనే సినిమా రిలీజ్ అవ్వగా మొదటి రోజు నుండి ప్రతీ రోజు కలెక్షన్స్ ఏ రోజుకి ఆ రోజు ఇంత కలెక్షన్స్ వచ్చాయి అంత కలెక్షన్స్ వచ్చాయి అంటూ పోస్టర్స్ ని వదిలారు నిర్మాతలు. తర్వాత ఏకంగా 100 కోట్లు క్రాస్ అయ్యింది అంటూ కూడా ఊదరగొట్టారు. దాంతో ఫ్యాన్స్ అదే నిజం అనుకున్నారు.
కానీ రన్ కంప్లీట్ అయ్యే టైం కి కర్ణాటక ట్రాకర్స్ అందరూ సినిమా 60 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించిందని తేల్చేశారు. దాంతో సోషల్ మీడియా లో 60 కి 100 వేసుకున్నారా అంటూ ట్రోల్ కి గురి అవుతున్నారు ఆ సినిమా యూనిట్… రీసెంట్ గా తెలుగు లో కూడా ఉప్పెన 100 కోట్లు దాటింది అంటూ ఊదరగొట్టగా సినిమా 85 కోట్లను అందుకుందని తెలిసింది.