Home న్యూస్ పండగ రోజు డెఫిసిట్లు-నెగటివ్ షేర్లు….మైండ్ బ్లాంక్ ఇది!!

పండగ రోజు డెఫిసిట్లు-నెగటివ్ షేర్లు….మైండ్ బ్లాంక్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లాంటి బెస్ట్ రిలీజ్ టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన 2 క్రేజీ సినిమాలు మిగిలిన సినిమాలను అన్నింటినీ డామినేట్ చేసి సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయి అనుకుంటే దానికి పూర్తి విరుద్దమైన ప్రదర్శనని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి తీవ్రంగా నిరాశ పరిచాయి….

మిస్టర్ బచ్చన్(Mr Bachchan) మరియు డబుల్ ఇస్మార్ట్(Double iSmart) సినిమాలు రెండూ కూడా మొదటి ఆటకే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుని ఏమాత్రం ఇంపాక్ట్ ను తర్వాత చూపించ లేక పోయాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా హాలిడేలు ఉన్నా కూడా…

రోజు రోజుకి కలెక్షన్స్ పరంగా మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 5వ రోజు రాఖీ పండగ అడ్వాంటేజ్ ఉండటంతో ఏమైనా హోల్డ్ ని చూపిస్తాయోమో అని అనుకుంటే మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించకుండా అనుకున్న దానికి మించి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…

Mr Bachchan Movie 4 Days Total WW Collections!!

డబుల్ ఇస్మార్ట్ కనీసం 7 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ని అయినా సొంతం చేసుకుంటే మిస్టర్ బచ్చన్ కనీసం 5 వేల టికెట్ సేల్స్ ను కూడా సొంతం చేసుకోలేక చాలా చోట్ల థియేటర్స్ లో జనాలు లేక షోలు కాన్సిల్ అవ్వడం, డెఫిసిట్ లు అలానే నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకుని…

అత్యంత దారుణంగా నిరాశ పరిచాయి. డబుల్ ఇస్మార్ట్ సినిమా విషయంలో కూడా పలు చోట్ల ఇదే రిపీట్ అవ్వగా ఓవరాల్ గా మంచి హిట్ మూవీకి రీమేక్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్, బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ లు రిలీజ్ కు ముందు ప్రామిసింగ్ గా అనిపించినా కూడా…

రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో అత్యంత తీవ్రంగా విఫలం అయ్యాయి. రెండు సినిమాల బడ్జెట్ కూడా టాప్ స్టార్స్ మూవీస్ రేంజ్ లో ఉండగా వసూళ్లు మాత్రం మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించకుండా అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ లను సొంతం చేసుకోబోతున్నాయి ఇప్పుడు.

Double iSmart Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here