Home న్యూస్ తప్పని పోటి 2 క్రేజీ సినిమాలు…ఏ హీరోకి ఛాన్స్ ఉందంటే!

తప్పని పోటి 2 క్రేజీ సినిమాలు…ఏ హీరోకి ఛాన్స్ ఉందంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) అలాగే ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) లు కూడా ఉన్నారు….ధమాకా తర్వాత రవితేజకి మళ్ళీ హిట్ సొంతం అవ్వలేదు…. ఇక రెడ్ మూవీ తర్వాత రామ్ కి కూడా వరుసగా ఫ్లాఫ్స్ పడ్డాయి…

ఇలాంటి టైంలో రామ్ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కాంబో అయిన పూరీ జగన్నాథ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) చేస్తూ ఉండగా పూరీకి కూడా ఇప్పుడు కంబ్యాక్ చాలా అవసరం.. మరో పక్క రవితేజ హరీష్ శంకర్ తో కలిసి మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) మూవీ చేస్తూ ఉండగా….

ఈ రెండు సినిమాలు ప్రామిసింగ్ గానే అనిపిస్తూ ఉండగా వేటికవి సోలో రిలీజ్ ను సొంతం చేసుకుంటే రెండు మూడు వారాల పాటు రన్ ఉండే సినిమాలే అయినా కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే రోజున పోటికి సిద్ధం అయ్యాయి…. పుష్ప2(Pushpa2 Movie) పోస్ట్ పోన్ అయిన వెంటనే..

ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు డబుల్ ఇస్మార్ట్ టీం వాళ్ళు….మరో 2 చిన్న సినిమాలు కూడా అదే వీకెండ్ లో రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేయగా సడెన్ గా ఎవ్వరూ ఊహించని విధంగా ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీ కూడా అదే డేట్ కి రిలీజ్ కానుందని అనౌన్స్ చేశారు…

ఆల్ రెడీ పోటిలో ఇతర సినిమాలు కూడా అదే డేట్ కి రావడానికి కారణం OTT వాళ్ళు వాళ్ళ ప్లాట్ ఫామ్ లో డేట్ ని ఫైనల్ చేసి ఈ డేట్ కి రిలీజ్ చేస్తేనే OTT లో రిలీజ్ డేట్ ను ఫైనల్ చేస్తామని చెప్పడం వలన చేసేదేమీ లేక పోటిలో ఇప్పుడు ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాబోతుంది….

వీటితో పాటు విక్రం తంగలాన్ కూడా రిలీజ్ ఉన్నప్పటికీ మేజర్ గా పోటి మన సినిమాల మధ్యే ఉంటుంది కాబట్టి రెండు సినిమాల ఓపెనింగ్స్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఎంతైనా ఉంది… కానీ ఆల్ రెడీ ప్రమోషన్స్ ను ముమ్మరం చేసిన డబుల్ ఇస్మార్ట్ 2 సాంగ్స్ హిట్ అవ్వడంతో ఆ సినిమాకి ఛాన్స్ ఎక్కువగా ఉంది..

కానీ రవితేజ హరీష్ శంకర్ ల కాంబోలో మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అయిన మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ ఇంకా జోరు అందుకోవాల్సి ఉండగా ట్రైలర్ క్లిక్ అయితే ఈ సినిమా బజ్ కూడా పెరగవచ్చు. రెండు సినిమాలు కీలకమే అవ్వడంతో అందరూ రెండు సినిమాలు ఆడియన్స్ ను అలరించి హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఇదే జరుగుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here