బాక్స్ అఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లో భాగంగా భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అయిన సినిమాల్లో ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చేసిన సినిమా మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie Review and Talk) సినిమా…స్పెషల్ ప్రీమియర్ షోలతో రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ మూవీ….
ఎలా ఉంది ఇనీషియల్ టాక్ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండీ…కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ సిన్సియర్ ఇంకం టాక్స్ ఆఫీసర్ అయిన హీరో ఒక పక్క అప్పుడప్పుడు బిగ్ షాట్స్ ఇంట్లో రైడ్స్ చేస్తూ ఉంటూ మరో పక్క తన ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి సిద్ధం అవుతున్న టైంలో…
విలన్ ఇంట్లో రైడ్ కి వెళ్ళాల్సి వస్తుంది…ఆ విలన్ జగబపతిబాబు కాగా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా మిగిలిన కథ పాయింట్….ఒరిజినల్ మూవీ నుండి కోర్ పాయింట్ ని తీసుకుని తెలుగు ఆడియన్స్ కి నచ్చే అన్ని ఎలిమెంట్స్ ను సినిమాలో జోడించిన హరీష్ శంకర్…..ఫస్టాఫ్ వరకు లవ్, కామెడీ అండ్ హీరోయిజం మీద మంచి ట్రాక్స్ రాసుకోగా…
ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో హై ఇచ్చి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచేయగా సెకెండ్ ఆఫ్ లో అసలు కథ మొదలు అయ్యి హీరో విలన్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్ తో ఆసక్తిగా సెకెండ్ ఆఫ్ ఉంటుంది, అక్కడక్కడా కొంచం డ్రాగ్ అయినా కూడా పైసా వసూల్ అనిపిస్తుంది….
మొత్తం మీద ఫస్టాఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించగా సెకెండ్ ఆఫ్ కథ కూడా అదే రేంజ్ లో అనిపించి ఓవరాల్ గా సినిమా అయ్యే టైంకి ఎబో యావరేజ్ లో ఆడియన్స్ కి అనిపిస్తుంది అని చెప్పాలి. రవితేజ రీసెంట్ మూవీస్ లో మిస్ అయిన మంచి ఎంటర్ టైన్ మెంట్ అండ్….
మంచి మ్యూజిక్ ఈ సినిమాలో ఉండటం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు…. ఇక రవితేజ ఎనర్జీ, హీరో హీరోయిన్ ల సీన్స్ బాగా ఆకట్టుకోగా ఫైట్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి…మొత్తం మీద ఒరిజినల్ చూసిన ఆడియన్స్ అయినా చూడని ఆడియన్స్ అయినా కూడా…
మిస్టర్ బచ్చన్ మూవీ చాలా వరకు పర్వాలేదు అనిపించే లా ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ప్రీమియర్స్ ని పూర్తి చేసుకున్న తర్వాత సినిమాకి ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ రిపోర్ట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే టాక్ రెగ్యులర్ షోల తర్వాత కూడా స్ప్రెడ్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ జాతర ఖాయమని చెప్పొచ్చు.