Home న్యూస్ మిస్టర్ బచ్చన్ టీసర్ రివ్యూ…..ఈ రేంజ్ అస్సలు ఊహించలేదుగా!!

మిస్టర్ బచ్చన్ టీసర్ రివ్యూ…..ఈ రేంజ్ అస్సలు ఊహించలేదుగా!!

0
Raviteja Mr Bachchan Teaser Review and talk
Raviteja Mr Bachchan Teaser Review and talk

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నాడు. ధమాకా(Dhamaka Movie) తర్వాత చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలను అందుకోలేదు. ఇలాంటి టైంలో రవితేజ తో మిరపకాయ్ బ్లాక్ బస్టర్ కాంబో హరీష్ శంకర్ తో కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ అయిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie)తో..

మాస్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఆగస్టు 15న సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు….టీసర్ కి ముందు పెద్దగా అంచనాలు లేవు, దానికి కారణం ఈ సినిమా హిందీలో…అప్పుడెప్పుడో వచ్చిన…

రైడ్ అనే సినిమాకి రీమేక్…పూర్తి సీరియస్ టోన్ తో సాగే ఆ కథని ఎలా చూపిస్తాడా అని అనుకోగా ఆ సీరియస్ కథకి ఒక బ్యాలెన్సుడ్ లవ్ స్టోరీని సెట్ చేసి, సాలిడ్ మ్యూజిక్ తో హైప్ పెంచేసిన హరీష్ శంకర్ టీసర్ తో అంచనాలను సాలిడ్ గా మించిపోయే రేంజ్ ఔట్ పుట్ ఇచ్చాడు…..

లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి తర్వాత సీరియస్ టర్న్ తీసుకునే మిస్టర్ బచ్చన్ టీసర్ రవితేజ మాస్ ఎలివేషన్ లతో నిండిపోయింది…”Success failures చుట్టాల్లాంటివి. వస్తుంటాయ్…వెళ్లిపోతుంటాయ్. కానీ, attitude ఇంటిపేరు లాంటిది. పోయే దాకా మనతోనే ఉంటుంది.” అంటూ చెప్పిన డైలాగ్…

బాగానే ఎలివేట్ అవ్వగా జగబపతిబాబు విలనిజం కూడా ఆకట్టుకోగా ఫస్ట్ మూవీతోనే భాగ్యశ్రీ బోర్సే ఆకట్టుకుంది…ఇక మిక్కీ జే మేయర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కుమ్మేసినట్లు అనిపించగా ఓవరాల్ గా రీమేక్ అయినా కూడా ఒరిజినల్ కి పూర్తి డిఫెరెంట్ టచ్ తో మిస్టర్ బచ్చన్ ఉండబోతుందని…

టీసర్ చూస్తె తెలిసిపోతుంది…. దాంతో రీమేక్ అయినా కూడా పెర్ఫెక్ట్ చేంజెస్ తో రానున్నట్లు అర్ధం అవుతున్న ఈ సినిమా ఒరిజినల్ ఆల్ రెడీ సూపర్ హిట్ అవ్వడంతో రీమేక్ కూడా అదే రేంజ్ లో టాక్ వస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here