Home న్యూస్ డిసెంబర్ లో మహేష్ సినిమా….ముఫాసా ట్రైలర్ రివ్యూ…కుమ్మేసింది!

డిసెంబర్ లో మహేష్ సినిమా….ముఫాసా ట్రైలర్ రివ్యూ…కుమ్మేసింది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం(Guntur Kaaram) తో సందడి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇక తర్వాత కొత్త సినిమా ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) డైరెక్షన్ లోనే ఉండబోతూ ఉండటంతో ఓ మూడేళ్ళు మహేష్ నుండి కొత్త సినిమా రావడం కష్టంగానే మారగా…. రీసెంట్ గా మురారి(Murari) సినిమా…

రీ రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ కొంత సంతోష పడ్డారు…ఇక ఫ్యాన్స్ ను మరోసారి సంతోష పెట్టడానికి మహేష్ బాబు ఈ ఇయర్ డిసెంబర్ లో ఓ పెద్ద సినిమాతో రాబోతున్నాడు, కానీ విజువల్ గా కనిపించకుండా వినిపించబోతున్నాడు…హాలీవుడ్ లో ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్….

మూవీస్ లో ముందుగా నిలిచే సినిమా ది లయన్ కింగ్ సిరీస్ లో వస్తున్నా రెండో పార్ట్ అయిన ముఫాసా(Mufasa: The Lion King) సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా యూనిక్ వె లో ఇండియాలో ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఉండగా తెలుగు వర్షన్ లో…

మెయిన్ ముఫాసా రోల్ కి ఏకంగా మహేష్ బాబుతో డబ్బింగ్ చెప్పించారు. ఇక రీసెంట్ గా సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయగా మహేష్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ లో కూడా సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి….ఇక ట్రైలర్ లో…

ముఫాసా చిన్ననాటి జీవితం, ఆ తర్వాత స్నేహితుడు స్కార్ తో కలవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతుండగా ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాలీవుడ్ హిట్స్ లో ఈ సినిమా నిలిచే ఛాన్స్ ఉందని అంచనా వేస్తూ ఉండగా ఇండియాలో….

కూడా అన్ని ఇండస్ట్రీలలో స్టార్స్ తో సినిమాకి డబ్బింగ్ చెప్పిస్తూ ఉండటంతో…ఇక్కడ ఏకంగా మహేష్ బాబే రంగంలోకి రావడం, అలాగే ట్రైలర్ లో మహేష్ వాయిస్ ఓవర్ బాగానే ఉండటంతో… తెలుగులో కూడా ఈ సినిమా రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here