Home న్యూస్ 200M మూవీ డైరెక్ట్ రిలీజ్…ములాన్ రివ్యూ…కుమ్మింది సినిమా!

200M మూవీ డైరెక్ట్ రిలీజ్…ములాన్ రివ్యూ…కుమ్మింది సినిమా!

0

2020 లో ఆడియన్స్ ముందుకు రావాల్సిన అనేక సినిమాలు డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి. వాటిలో హాలీవుడ్ నుండి వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి… చైనా లో ఈ ఇయర్ మొదట్లో రిలీజ్ అయిన డిస్నీ వారి ములాన్ సినిమా అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది, ఇండియా లో కూడా అప్పుడే రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయ్యి రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది…..

డిస్నీ వాళ్ళు ఏకంగా 200 మిలియన్స్ డాలర్స్ తో తెరకెక్కించిన ఈ సినిమాను డైరెక్ట్ గా రిలీజ్ చేయగా ఇండియా లో ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రిలీజ్ అవ్వడం విశేషం, మరి సినిమా కథ ఏంటి ఎలా ఉంది లాంటి విశేషాలను తెలుసు కుందాం పదండి.. ముందుగా కథ పాయింట్ కి వస్తే…..

కొన్ని అతీత శక్తులతో పుట్టిన హీరోయిన్ ని చిన్నప్పటి నుండి వాళ్ళ పేరెంట్స్ ఆ శక్తులను దాచేసి ఒక మామూలు అమ్మాయిగా పెంచుతారు, కానీ అప్పుడప్పుడు తన శక్తులను ప్రదర్శిస్తూనే ఉంటుంది హీరోయిన్… ఇక పెద్దయ్యాక పెళ్లి కూడా సెట్ అయ్యే టైం లో ఇలా…

తన శక్తులను ప్రదర్శించడంతో పెళ్లి ఆగిపోతుంది, అదే టైం లో దేశం పై ఓ మంత్రగత్తెతో కలిసి విలన్ రాజు పై దండెత్తడానికి సిద్ధం అవుతాడు. ఆ టైం లో రాజు ప్రతీ ఇంటి నుండి ఒక పురుషుడు యుద్ధంలో పాల్గొనాల్సి ఉంటుంది అంటూ ఆదేశాలు ఇస్తాడు…. ఇలానే ఇది వరకు యుద్ధం చేసి ఫిజికల్ గా దెబ్బతిన్న హీరోయిన్ ఫాదర్ కి…

ఇద్దరూ కూతుర్లే అవ్వడం తో మళ్ళీ తానె యుద్ధంలోకి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు, ఈ సారి తండ్రి యుద్ధంలోకి వెళితే తిరిగి రాలేడేమో అని హీరోయిన్ మగాడిగా యుద్ధంకి వెళుతుంది, తర్వాత ఎం జరిగింది, ఈ నిజం యుద్ద సైన్యాధికారికి తెలిసిందా, ఎవరు గెలిచారు లాంటి విషయాలు అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

సినిమా కథ పాయింట్ బాగానే ఉన్నప్పటికీ నటించిన వాళ్ళు అందరూ బాగానే నటించినా కానీ మనకు కనెక్ట్ కాక పోవడం కథ యిట్టె చెప్పే విధంగా ఉండటం, స్క్రీన్ ప్లే కూడా అంత ఫాస్ట్ గా లేక పోవడం ఈ సినిమా మేజర్ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి, కానీ అదే టైం లో…ఫైట్ సీన్స్ బాగా ఉండటం…

ఉన్నంతలో తక్కువ గ్రాఫిక్స్ అయినా బాగుండటం, హీరోయిన్ స్టంట్స్ కూడా ఆకట్టుకోవడం, బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించడం, వార్ ఎపిసోడ్ విజువల్స్ అద్బుతంగా ఉండటం లాంటి ప్లస్ పాయింట్స్ తో సినిమా బాగుంది అనిపిస్తుంది, సినిమా స్టార్ట్ చేశాక కొద్ది సేపు బోర్ కొట్టినా కానీ తర్వాత మనం కూడా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం..

కథ పాయింట్, మలుపులు మనం ఊహించినట్లే అవుతున్నా కానీ సినిమా ఎండ్ వరకు ఆసక్తిగా అనిపిస్తుంది, అదే సినిమాకి కలిసి వచ్చింది అని చెప్పాలి. మొత్తం మీద డిస్నీ నుండి ఇది వరకు వచ్చిన అద్బుత సినిమాలతో పోల్చితే కొంచం వీకే కానీ ఉన్నంతలో బాగుంది ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది ములాన్ సినిమా.. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here