Home TRP రేటింగ్ అమ్మింది 1 కోటి…రెండో సారి కూడా కుమ్మేసిన సైకో సినిమా TRP!

అమ్మింది 1 కోటి…రెండో సారి కూడా కుమ్మేసిన సైకో సినిమా TRP!

0

కొన్ని కొన్ని సినిమాలు కోట్లు పోసి కొని టెలికాస్ట్ చేసినా కానీ మంచి రేటింగ్ లను సాధించ లేవు, అదే టైం లో కొన్ని సినిమాల రేట్లు చాలా తక్కువే అయినా కానీ మంచి రిజల్ట్ లను సొంతం చేసుకుంటూ ఉంటాయి, అలాంటి కోవలోకే వస్తుంది మరో చిన్న సినిమా సైకో… ఈ ఇయర్ తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ ఆడియన్స్ ను కొంతవరకు మెప్పించాగా తెలుగు లో అప్పుడే రావాల్సింది కానీ కరోనా వలన మిస్ అయిన ఈ సినిమా..

లేట్ గా టెలివిజన్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, స్టార్ మా ఛానెల్ ఈ సినిమాను కేవలం కోటి రేటు కి కొని టెలివిజన్ లో డబ్ చేసి రిలీజ్ చేయగా సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ అయిన టైం లో సాలిడ్ TRP రేటింగ్ సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి..

సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 5.89 రేటింగ్ ను సొంతం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది, పెట్టిన రేటు ప్రకారం ఇది అల్టిమేట్ రేటింగ్ అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా మరోసారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా రెండో సారి కూడా బాగానే హోల్డ్ చేసి డీసెంట్ రేటింగ్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు సైకో సినిమా కి 3.64 రేటింగ్ దక్కడం విశేషం, ఇది ఈ వారం కొత్తగా టెలికాస్ట్ అయిన మరో తమిళ్ ఎంటర్ టైనర్ కోమాలి కన్నా కూడా ఎక్కువ రేటింగ్ అవ్వడం అది కూడా రేటు చాలా తక్కువ అయినా కానీ స్ట్రాంగ్ రేటింగ్ తో హోల్డ్ చేసి ఆడియన్స్ మెప్పు పొందటం విశేషం అని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా పై కేవలం…

కోటి లోపే పెట్టుబడి పెట్టిన స్టార్ మా ఛానెల్ కి ఈ సినిమా ఫస్ట్ టైం మే మంచి ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టగా సెకెండ్ టైం కూడా హోల్డ్ చేసి మరోసారి సాలిడ్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది, మొత్తం మీద కొన్ని పెద్ద సినిమాలు అంచనాలను అందుకొక పోవడం తో ఈ చిన్న సినిమాలు వాటి ప్లేస్ లో ఆడియన్స్ ను మెప్పిస్తున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here