కింగ్ నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చూపి చాలా కాలమే అవుతుంది, 2016 లో బాక్ టు బాక్ సెన్సేషనల్ హిట్స్ కొట్టిన కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన అలాగే ఊపిరి సినిమాలతో కెరీర్ బెస్ట్ ఫామ్ ని అందుకుని బ్లాక్ బస్టర్ లు సొంతం చేసుకున్నాడు. కానీ తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా అంచనాలను అందుకోలేక పోయాయి. ముఖ్యంగా లాస్ట్ రెండు మూడు సినిమాలు అయితే మరింత నిరాశ పరిచాయి.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫీసర్ జీరో షేర్ ని సాధించగా మన్మథుడు 2 సినిమా అట్టర్ డిసాస్టర్ మూవీ గా నిలిచింది. ఇలాంటి టైం లో కూడా సేఫ్ అవ్వాలని కమర్షియల్ మూవీ చేయకుండా డేర్ తో మరో ఎక్స్ పెరిమెంటల్ మూవీ చేశాడు కింగ్ నాగార్జున… ఆ సినిమానే…
వైల్డ్ డాగ్…డిఫెరెంట్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు తీసుకు వద్దామని అనుకోగా నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సెన్సేషనల్ రేటు ఆఫర్ ని ఈ సినిమా కి ఇచ్చారు, ఏకంగా 28 కోట్ల రేంజ్ ఆఫర్ ని డిజిటల్ రిలీజ్ కోసం ఇవ్వడం తో నాగార్జున డిజిటల్ రిలీజ్ కి…
మొగ్గు చూపగా సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు రావాలని ప్రెషర్ ఉంది.. ముఖ్యంగా మే నెలలో టాలీవుడ్ సీనియర్ హీరోలు అందరూ ఒకరి తర్వాత ఒకరు బరిలోకి దిగుతూ ఉండగా వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ని ఇంకా కన్ఫాం చేయలేదు. ఇలాంటి టైం లో నెట్ ఫ్లిక్స్ వాళ్ళతో థియేటర్స్ లో కూడా రిలీజ్ చేస్తామని మంతనాలు జరిగాయట. దానికి వారు ఒక వారం గ్యాప్ తో డిజిటల్ రిలీజ్ చేస్తే…
20 కోట్ల రేటు ఇస్తామని చెప్పారట… అంటే ముందు అనుకున్న రేటు కన్నా 8 కోట్ల తక్కువ ఇస్తామని చెప్పారు, దాంతో యూనిట్ మిగిలిన 8 కోట్ల వర్త్ కి సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ చేసి వారంలో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారని టాక్.. సినిమాకి టాక్ వస్తే 8 కోట్లు వారంలో రికవరీ అవ్వడం ఏమంత కష్టం కాదని చెప్పొచ్చు. మరి ఫైనల్ గా ఇదైనా కన్ఫాం అవుతుందో లేదో చూడాలి.