Home గాసిప్స్ జస్ట్ 15 రోజులే….ఏం అవుతుందో మరి!!

జస్ట్ 15 రోజులే….ఏం అవుతుందో మరి!!

0

     యువ సామ్రాట్ నాగ చైతన్య రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకున్నా కానీ లాస్ట్ ఇయర్ సమ్మర్ లో వచ్చిన మజిలీ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు. భారీ పోటి లో కూడా ఈ సినిమా 40 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి నాగ చైతన్య కెరీర్ లో మొట్ట మొదటి 40 కోట్ల షేర్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించింది.

ఇక ఈ సినిమా తర్వాత ఫిదా తో సూపర్ సక్సెస్ కొట్టిన శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టొరీ ని మొదలు పెట్టాడు నాగ చైతన్య. ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సింది కానీ లాక్ డౌన్ వలన…

ఈ సినిమా కూడా నిలిచిపోయి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి లో మిగిలిన సినిమాలతో పాటు ఎదురు చూస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో ఇంకా ఎన్ని రోజులు బాలెన్స్ ఉన్నాయి అన్న న్యూస్ ని టీం అఫీషియల్ గా తెలియ జేశారు.

ఆ న్యూస్ ప్రకారం సినిమా కి అఫీషియల్ గా మరో 15 రోజుల షూటింగ్ మాత్రమె బాలెన్స్ ఉందని అంటున్నారు, అది తప్పితే మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఇప్పుడు లాక్ డౌన్ లో కంప్లీట్ అయిపోయిందని, చాలా వరకు ఎడిటింగ్ కూడా పూర్తీ అయిందని సమాచారం. దాంతో లాక్ డౌన్ అయిన వెంటనే ఈ సినిమా…

మిగిలిన షూటింగ్ ని కంప్లీట్ చేసి ఇప్పుడు మంచి హాలిడే రోజున సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే వినాయక చవితి కి సినిమా ఆడియన్స్ ముందుకు రావోచ్చనే టాక్ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. ఇటు శేఖర్ కమ్ముల అటు నాగచైతన్య సాలిడ్ హిట్స్ కొట్టారు కాబట్టి ఈ సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here