బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది, 2016 లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన నాగార్జున తర్వాత మాత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోతున్నాడు, సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి లాంటి మంచి సినిమాలతో హిట్స్ కొట్టినా తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా మినిమమ్ అంచనాలను అందుకోలేదు, ఆఫీసర్ మరియు మన్మథుడు 2 లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ మూవీస్ గా నిలవడం తో ఆ ఇంపాక్ట్…
మంచి టాక్ తెచ్చుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయ్యేలా చేసింది లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ ని, సినిమా తర్వాత డిజిటల్ లో మంచి పేరు తెచ్చుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్…
రిజల్ట్ చూసిన తర్వాత కమర్షియల్ ఎంటర్ టైనర్ కోసం ట్రై చేస్తున్న నాగార్జున ఈ సినిమా తర్వాత కమిట్ అయిన ప్రవీణ్ సత్తారు సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు సూచించారట, కానీ కథ లో మార్పులు ఇటు డైరెక్టర్ కి అటు హీరో కి నచ్చకపోవడం తో ఇప్పుడు ఆ కథనే…
రిజక్ట్ చేశారని తెలుస్తుంది, కారణాలు ఏంటి అనేవి బయటికి చెప్పడం లేదు క్రియేటివ్ డిఫెరెన్సెస్ వలన ఈ ప్రాజెక్ట్ ను ఆపేశారని అంటున్నారు. దాంతో ఇప్పుడు ఉన్నపళంగా నాగార్జున తన సోలో లాస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సోగ్గాడే చిన్నినాయన సినిమా కి సీక్వెల్ బంగార్రాజు ని మొదలు పెట్టాలని ప్లానింగ్ లో ఉన్నారని సమాచారం.
కళ్యాణ్ కృష్ణ ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేశారని, నాగ్ ఒకసారి విని ఓకే చేయడం ఒక్కటే బాలెన్స్ అని అంటున్నారు. మరి నాగార్జున ఈ స్క్రిప్ట్ ను ఓకే చేసి ఈ సినిమా తో కంబ్యాక్ ఇస్తారో లేక మరేదైనా ప్రయోగం చేయడానికి సిద్ధం అవుతారా అన్నది తెలియాల్సి ఉంది.. ప్రస్తుతానికి అయితే నాగార్జున కొత్త సినిమా ఇదే అని అంటున్నారు.