బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) సోలో హీరోగా నటించి హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది…అప్పుడెప్పుడో సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో బాక్స్ అఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టిన నాగార్జున తర్వాత చేసిన సినిమాలు అంచనాలను అందుకోలేదు అనే చెప్పాలి…
మధ్యలో కార్తీతో కలిసి చేసిన ఊపిరి, నాగ చైతన్య(Naga Chaitanya)తో కలిసి చేసిన బంగార్రాజు(Bangarraju Movie) లతో హిట్ అందుకున్నా కూడా సోలో హీరోగా చేసిన సినిమాలు ఏవి కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేదు…ఓం నమో వెంకటేశాయా, రాజు గారి గది2, ఆఫీసర్ లు ఫ్లాఫ్ అవ్వగా…
తర్వాత నాని(Nani) తో కలిసి చేసిన దేవదాస్ కూడా అంచనాలను అందుకోలేదు….తర్వాత చేసిన మన్మథుడు2, వైల్డ్ డాగ్ మరియు ది ఘోస్ట్ సినిమాలు ఏవి కూడా అంచనాలను అందుకోలేదు అనే చెప్పాలి…దాంతో ఆల్ మోస్ట్ సోలో హీరోగా 8 ఏళ్ల దాకా హిట్ ని అందుకోలేక పోయిన నాగార్జున…
ఏ సంక్రాంతికి సోలో హీరోగా హిట్ కొట్టాడో మళ్ళీ 8 ఏళ్ల తర్వాత అదే సంక్రాంతికి నా సామి రంగ(Naa Saami Ranga) మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీతని దాటాడు… సినిమాలో కూడా అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ లు నటించినా వాళ్ళ మార్కెట్ చాలా చిన్నది… ఆ రోల్స్ కూడా చిన్నవే కాగా…
నాగార్జున సోలో హీరోగా నా సామి రంగ సినిమాతో ఇప్పుడు మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకోగా పోటిలో హనుమాన్(HanuMan Movie) వీర విహారాన్ని తట్టుకుని బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం విశేషమే. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమాతో నాగార్జున ఎంతవరకు జోరు చూపిస్తాడో చూడాలి ఇక…