Home న్యూస్ వరుస ఫ్లాఫ్స్…అయినా వైల్డ్ డాగ్ కి రికార్డ్ లెవల్ బిజినెస్!

వరుస ఫ్లాఫ్స్…అయినా వైల్డ్ డాగ్ కి రికార్డ్ లెవల్ బిజినెస్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున తన దైన రేంజ్ లో హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. 2016 లో బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము లేపే ఫామ్ అందుకున్న నాగార్జున తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా అంచనాలను అందుకోలేక పోయాయి. ఇలాంటి టైం లో రీసెంట్ గా చేసిన 2 సినిమాలు మరింత భారీ షాక్ ని ఇచ్చాయి, అవే ఆఫీసర్ మరియు మన్మథుడు 2 సినిమాలు. ఈ రెండు సినిమాలు…

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్లు గా నిలవడం తో నాగార్జున అప్ కమింగ్ మూవీ వైల్డ్ డాగ్ కి అంతకుముందు నాగ్ మూవీస్ తో పోల్చితే కొంచం తక్కువ హైప్ ఉంది. డిలే అవుతూ రావడం కూడా ఇందుకు ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు కానీ ఇదే సినిమా తో…

కింగ్ నాగార్జున ఇప్పటికీ తన క్రేజ్ పవర్ తగ్గలేదు అని నిరూపించి మాస్ పవర్ చూపెట్టాడు… ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం సినిమాను 20 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించారట. కాగా సినిమాను థియేటర్స్ లో రిలీజ్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.

లీడింగ్ OTT యాప్స్ లో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ఈ నెల ఎండ్ లో డైరెక్ట్ రిలీజ్ చేయబోతుందట. అందుకోసం భారీ రేటు చెల్లించి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుందట. ఆ రేటు ఏకంగా 23 కోట్ల రేంజ్ లో దక్కిందని అంటున్నారు ఇప్పుడు. ఇది నిజంగానే సెన్సేషనల్ రేటు అనే చెప్పాలి. ఎక్స్ పెరిమెంటల్ మూవీ తోనే అది కూడా కొంచం తక్కువ బజ్ ఉన్న సినిమా తో కూడా…

కింగ్ నాగార్జున ఈ రేంజ్ బిజినెస్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం. సినిమా బడ్జెట్ మొత్తం ఇక్కడే రికవరీ అయ్యి 3 కోట్ల దాకా ప్రాఫిట్ ఇక్కడే దక్కింది అని చెప్పాలి. ఇక సినిమా శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ లాంటివి ఎలాగూ ఉన్నాయి కాబట్టి భారీ లాభాలను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here