Home న్యూస్ 28 కోట్ల రేటు ను నో అన్నారు…వైల్డ్ డాగ్ కి జరిగిన టోటల్ బిజినెస్ ఇదే!!

28 కోట్ల రేటు ను నో అన్నారు…వైల్డ్ డాగ్ కి జరిగిన టోటల్ బిజినెస్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, 2016 టైం లో సోగ్గాడే చిన్ని నాయన మరియు ఊపిరి లాంటి బాక్ టు బాక్ సాలిడ్ మూవీస్ ని సొంతం చేసుకున్న నాగార్జున తర్వాత చేసిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఆశాజనకంగా ప్రదర్శన చూపలేదు. అందునా లాస్ట్ రెండు రిలీజ్ లు ఆఫీసర్ మరియు మన్మథుడు 2 అయితే మట్టుకు మరింత నిరాశ పరిచాయి అని చెప్పాలి.

ఇలాంటి టైం లో కమర్షియల్ మూవీ తో కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే మళ్ళీ ప్రయోగం చేసిన కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ అంటూ మరో డిఫెరెంట్ మూవీ తో ఆడియన్స్ ముందుకు రానుండగా ముందుగా ఈ సినిమా కి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సాలిడ్ ఆఫర్స్ దక్కాయి.

నెట్ ఫ్లిక్స్ ఏకంగా 28 కోట్ల భారీ రేటు ఇవ్వడానికి కూడా సిద్దం అయింది, అయినా కానీ ఆ ఆఫర్ కి నో చెప్పిగా వైల్డ్ డాగ్ కి మొత్తం మీద జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఒకింత తక్కువగానే జరిగింది అని చెప్పాలి. ఆ వివరాలను గమనిస్తే… సినిమా కి నైజాం ఏరియాలో…

2.5 కోట్ల బిజినెస్, సీడెడ్ లో 1.2 కోట్ల బిజినెస్, ఆంధ్రలో 4 కోట్ల బిజినెస్ జరగగా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 7.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 50 లక్షల బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 8.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది.

దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 9.4 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది, టాక్ వస్తే ఈ మార్క్ ని అవలీలగా అందుకోవచ్చు. ఇక 28 కోట్ల నెట్ ఫ్లిక్స్ ఆఫర్ తో పోల్చితే ఈ రేటు చాలా తక్కువే అయినా కానీ సినిమాకి నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని, దాంతో ఈ రేటు లెవల్ లోనే ఓవరాల్ బిజినెస్ జరిగిందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here