నాచురల్ స్టార్ నాని హీరోగా కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దసరా ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్ లో రిలీజ్ కాబోతుండగా సినిమా కోసం నాని ఇండియా వైడ్ గా వివిధ ప్లేసులలో భారీ ఎత్తున ప్రమోషన్స్ ని చేస్తూనే ఉన్నాడు…. ఇక సినిమా గురించిన ఆసక్తి కరమైన వార్తా ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆ వార్తా ప్రకారం సినిమా మొత్తం బడ్జెట్…
అంచనాలను అన్నీ కూడా మించిపోయిందని అంటున్నారు. సినిమా నాని కెరీర్ లోనే ఇప్పుడు హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అంటున్నారు. ఇది వరకు శ్యామ్ సింఘ రాయ్ కానీ అంటే సుందరానికీ కానీ బడ్జెట్ పరంగా 40 నుండి 45 కోట్ల దాకా బడ్జెట్ తో రూపొందాయి. కానీ ఇప్పుడు దసరా సినిమా…
మొత్తం మీద 65 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందింది అని సమాచారం. ఇక్కడితో అయిపోలేదు… సినిమా కి ఇప్పుడు భారీగా జరుగుతున్న ప్రమోషన్స్ కానీ… షూట్ మొదలు పెట్టక ముందు చేసిన టెస్ట్ షూట్ కానీ… ఇప్పుడు హిందీ రిలీజ్ కోసం క్యూబ్ ఖర్చులు థియేటర్స్ అగ్రిమెంట్స్ ఇలా అన్నీ కలిపి…
ఆల్ మోస్ట్ 75 కోట్లకు పైగానే సినిమా కి నిర్మాతకి ఖర్చు అయిందని అంటున్నారు. మొత్తం మీద ఈ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన నాని దసరాకి బజ్ అయితే ఇప్పుడు మంచి ఊపులో ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం టాక్ బాగున్నా కానీ కచ్చితంగా సినిమా దుమ్ము లేపే అవకాశం ఉంటుందని అంటున్నారు.