నాచురల్ స్టార్ నాని కెరీర్ లో డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా జెండా పై కపిరాజు. సముద్రఖని డైరెక్షన్ లో మంచి హైప్ నడుమ మొదలు అయినా రిలీజ్ కి చాలా టైం పట్టి ఆఖరికి ఒకే సారి నాని నటించిన మరో సినిమా ఎవడె సుబ్రహ్మణ్యం తోనే పోటికి దిగి కాంపిటీషన్ లో టాక్ కొంచం తేడాగా రావడంతో లాంగ్ రన్ లో ఓవరాల్ గా యావరేజ్ గా పరుగును ముగించింది.
ఇక టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వడానికి కూడా సినిమా కి చాలా అంటే చాలా టైం పట్టింది, ఏకంగా 5 ఏళ్ల తర్వాత సినిమా ను స్టార్ మా ఛానెల్ వాళ్ళు సుమారు 2 కోట్ల రేంజ్ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.
ఇక సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు జస్ట్ ఓకే అనిపించే TRP రేటింగ్ ని మాత్రమె అందుకోగా రీసెంట్ గా మరో సారి టెలికాస్ట్ అయ్యి కూడా యావరేజ్ రేటింగ్ తోనే సరిపెట్టుకుంది. ఓవరాల్ గా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 5.72 TRP రేటింగ్ ని సొంతం చేసుకోగా…
రెండో సారి టెలికాస్ట్ టైం లో 3.98 రేటింగ్ ని సొంతం చేసుకుంది, ఇది ఓవరాల్ గా సినిమా ను కొన్న రేటు ప్రకారం టెలికాస్ట్ లేట్ ప్రకారం చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు కానీ నాని కి బుల్లి తెరపై కూడా ఆడియన్స్ బాగానే ఉన్న నేపధ్యంలో కొంచం బెటర్ రేటింగ్స్ ని అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు అని చెప్పాలి.
అదే సమయం లో కొన్ని డబ్ మూవీస్ కూడా ఇలానే 5 ఏళ్ల తర్వాత లేట్ గా టెలికాస్ట్ అవ్వగా TRP రేటింగ్ మాత్రం చాలా బెటర్ గా వచ్చింది. కానీ ఈ సినిమా విషయం లో మాత్రం TRP తక్కువగా రాగా సినిమా మరో రెండు మూడు సార్లు టెలికాస్ట్ అయితే… ఛానెల్ ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి…