బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వాల్సిన మల్టీ స్టారర్ మూవీ వి కరోనా ఎఫెక్ట్ వలన థియేటర్స్ లో రిలీజ్ కాకుండా ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుంది. సమ్మర్ రేసులో రావాల్సిన ఈ సినిమా ను మంచి డీల్ సెట్ చేసి 35.4 కోట్ల రేటు కి అమెజాన్ ప్రైమ్ కి అమ్మేయగా సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి టాక్ కి అతీతంగా…
మంచి వ్యూస్ తో దూసుకు పోతుంది, ఈ క్రమం లో నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా అవ్వడం తో ఎంత వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు, మల్టీ స్టారర్ లో నటించిన సుధీర్ బాబు ఎంతవరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు అన్నది ఆసక్తిగా మారగా…
ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమా ఇద్దరూ కూడా కెరీర్ బెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారు అని టాక్ ఉంది. నాని ఒక్కో సినిమా కి ఈజీగా 5 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ మినిమమ్ అందుకుంటాడు, ఇక సుదీర్ బాబు కూడా 1.5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకుంటాడని ట్రేడ్ లో టాక్ ఉంది.
కాగా వి ది మూవీ కి గాను నాని కెరీర్ లోనే హైయెస్ట్ అనిపించే విధంగా 6.5 కోట్ల రెమ్యునరేషన్ దాకా తీసుకున్నాడని సమాచారం. ఇక సుధీర్ బాబు కూడా 2 కోట్ల మేర రెమ్యునరేషన్ ని ఈ సినిమా కోసం తీసుకున్నారని ట్రేడ్ లో టాక్ ఉంది. నాని కి ఇంకా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటె…
ప్రాఫిట్ లో షేర్ కూడా వచ్చేది కానీ ఇప్పుడు అవి తీసుకుంటాడో లేదో అన్నది ఇంకా క్లారిటీ లేదని తెలుస్తుంది, సినిమా టోటల్ అన్ని కలిపి బిజినెస్ అండ్ ప్రాఫిట్ లెక్కలు క్లియర్ గా రివీల్ అయ్యాక ఈ వివరాలు కూడా రివీల్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.