నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వి ది మూవీ లో సుదీర్ బాబు కీలక పాత్ర పోషిస్తుండగా సినిమా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సెప్టెంబర్ 5 న దక్కించుకోబోతుంది. సినిమా పై మంచి అంచనాలు ఉన్నా థియేటర్స్ లో రిలీజ్ చేసే పరిస్థితులు లేక పోవడం తో మంచి రేటు ఆఫర్ రావడం తో సినిమాను ఇప్పుడు డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు.
ఇక సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుంది. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సెన్సార్ పనులు ఏంటి అంటూ కొందరికీ డౌట్ ఉన్నా…టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యే లేదా టెలివిజన్ రైట్స్ అమ్ముడు పోయిన ఏ సినిమా అయినా సెన్సార్ పనులకు వెళ్ళాల్సి ఉంటుంది.
అలా కాకుండా కేవలం స్ట్రీమింగ్ సైట్స్ కే ఎక్స్ క్లూజివ్ గా రూపొందించే కంటెంట్ కి సెన్సార్ ఉండదు కానీ వాటికి కూడా సెన్సార్ చేయాలని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. త్వరలోనే ప్రభుత్వం వాటిపై నిర్ణయం తీసుకోనుంది. ఇక వి మూవీ విషయానికి వస్తే… సినిమా కి U/A సర్టిఫికెట్ జారీ చేయగా…
సినిమా టోటల్ లెంత్ 2 గంటల 23 నిమిషాలు అని రివీల్ అయింది. ఇక సినిమా కి ఇనీషియల్ టాక్ కూడా బాగుంది అంటున్నారు. రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో దుమ్ము లేపాడని అంటున్నారు. క్లైమాక్స్ షాక్ ఇచ్చినట్లే ఇచ్చి మంచి థ్రిల్ ఇస్తుంది అన్న చిన్న లీక్స్ అక్కడ నుండి బయటికి వచ్చాయి.
సమ్మర్ రేసు లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానుండగా ఫ్యాన్స్ మొదట్లో ఈ న్యూస్ తో భాదపడ్డా పరిస్థితులను అర్ధం చేసుకుని ఇప్పుడు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 5 న రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి మరి…