టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు, తన నిర్మాణం లో వచ్చే సినిమాలు దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ లను అందుకున్న సినిమాలే. లేటెస్ట్ గా దిల్ రాజు బ్యానర్ నుండి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అయిన సినిమా నాని సుధీర్ బాబులు నటించిన వి ది మూవీ. థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనుకుంటే సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు.
అయినా కానీ సినిమా వల్ల ఎవ్వరికీ ఎలాంటి నష్టం కలగలేదు సరికదా పై పెచ్చు నిర్మాతకి అల్టిమేట్ లాభాలు ఎప్పటి లాగే వచ్చాయి… ఓవరాల్ గా సినిమా బడ్జెట్ నుండి ప్రాఫిట్ వరకు వివరాలను ఒకసారి గమనిస్తే… ముందుగా సినిమా బడ్జెట్… లేట్ వలన కట్టిన వడ్డీలు కూడా కలిపి…
35 కోట్ల రేంజ్ లో అవ్వగా సినిమాను డైరెక్ట్ రిలీజ్ కింద మొత్తం మీద 35.4 కోట్ల రేటు కి అమ్మి 40 లక్షల ప్రాఫిట్ ని అప్పటికే అందుకోగా… తర్వాత తెలుగు శాటిలైట్ రైట్స్ 8 కోట్లు, హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ 8.5 కోట్లు దక్కించుకున్న ఈ సినిమా… మ్యూజిక్ రైట్స్ కింద…
80 లక్షల దాకా అందుకోగా… ఇతర భాషల్లో కూడా డబ్ అవ్వగా వాటి శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడు పోవాల్సి ఉంది, అది పక్కకు పెడితే టోటల్ గా సినిమా సాధించిన బిజినెస్ 52.7 కోట్ల బిజినెస్ ని ఓవరాల్ గా అందుకుంది ఈ సినిమా. అందులో సినిమా బడ్జెట్ ని పక్కకు పెడితే… 17.7 కోట్ల ప్రాఫిట్ ని తెచ్చి పెట్టింది.
ఇక ఇతర భాషల డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ని మినిమమ్ రేటు తో లెక్కల్లో తీసుకున్నా ఓవరాల్ గా సినిమా ప్రాఫిట్ లెక్కలు అవలీలగా 20 కోట్ల రేంజ్ కి తగ్గకుండా ఉండటం ఖాయమని చెప్పొచ్చు. మొత్తం మీద నిర్మాత కి ఈ సినిమా అద్బుతమైన లాభాలను థియేటర్స్ తెరచి లేకున్నా కూడా సొంతం చేసి పెట్టింది అని చెప్పాలి….